For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రాగన్ చికెన్ రిసిపి: చైనీస్ స్పెషల్

|

మీరు ఎప్పుడైనా చైనీస్ వంటలను ప్రయత్నించారా? డ్రాగాన్ చికెన్ ?డ్రాగాన్ చికెన్ ను చైనీస్ రెస్టారెంట్లలో తప్ప మరెక్కడా చూసి ఉండరు. ఈ మౌత్ వాటరింగ్ చికెన్ రిసిపిని కాస్త ఓపిగ్గా మనం ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. మీరు ఈ అద్భుత రుచికరమైన డ్రాగాన్ చికెన్ ను డిన్నర్ కు తయారుచేసుకోవచ్చు.

ఈ సింపుల్ రిసిపి తయారుచేసే పద్దతిని క్రింది విధంగా ఇవ్వబడింది. డ్రాగాన్ చికెన్ తయారుచేయడానికి కాస్త ఓపికగా తయారుచేయాలి. ఈ డ్రాగాన్ రిసిపిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ప్రయత్నించండి..

non veg Dragon Chicken Recipe: Chinese Spcl
కావల్సిన పదార్థాలు:
చికెన్, బోన్ లెస్ - 1 kg (పెద్దగా కట్ చేసుకోవాలి)
అల్లం - 1/2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
వెల్లుల్లి - 1/2 tbsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఎండు మిర్చి - 1 1/2 tsp
టొమాటో సాస్ - 8 ఔన్సు
సోయ్ సాస్ - 1tbsp
చక్కెర - 1 / 2tsp
కొత్తిమీరతరుగు -1cup
ఉల్లిపాయలు - 1 (చిన్న ముక్కలుగా తరగాలి)
గ్రీన్ ఉల్లిపాయలు / ఉల్లిపాయ లీకేజ్ - 1స్ప్రింగ్
వెజిటేబుల్ ఆయిల్: సరిపడా
ఫార్మేషన్ కోసం:
అల్లం పేస్ట్ : 1tsp
వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
మిరియాలు - 1 1/2tsp
ఎగ్ వైట్ - 1 గుడ్డు
జొన్న పిండి - 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను మ్యారినేషన్ కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్నింటి మిక్స్ చేసి, చికెన్ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మ్యారినేట్ చేసిన తర్వాత 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ను, కాగే నూనెలో వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేయాలి.
4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, అల్లం మరియు గార్లిక్ వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులో ఎండుమిర్చి వేసి, అలాగే టమోటో సాస్, సోయా సాస్, మరియు పంచదార వేసి, ఫ్రై చేయాలి . సాస్ కొద్దిగే ఉడికే వరకూ వేయించాలి.
6. ఇవి ఉడికిన తర్వాత అందులో ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం బాగా ఉడికే వరకూ ఉడికించుకోవాలి.
7. మంటను పూర్తిగా తగ్గించి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, ఉల్లిపాయ తరుగుతో డ్రాగాన్ చికెన్ ను గార్నిష్ చేసిన సర్వ్ చేయాలి.
ఈ చైనీస్ డ్రాగాన్ చికెన్ వేడివేడిగా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి.

English summary

non veg Dragon Chicken Recipe: Chinese Spcl

Have you tried making the Chinese specialty, Dragon chicken at your home? There are a number of people who indulge themselves in a dish of dragon chicken when ever they visit a Chinese restaurant. But, what if you can bring this mouth watering dish all the way from China to your little kitchen!
Story first published: Saturday, December 28, 2013, 15:14 [IST]
Desktop Bottom Promotion