For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

న్యూట్రీషియన్ ఎగ్-బేసన్ ఆమ్లెట్

|

మీ దినచర్యను ఒక హెల్తీ మీల్ తో ప్రారంభించాలి. ఈ బేసన్ ఆమ్లెట్ రిసిపి తయారుచేయడం చాలా సులభం. మరియు ఇలా స్పెషల్ గా తయారుచేసే ఆమ్లెట్ ను పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతారు. మీ పిల్లలు గుడ్డు తినడం ఇష్టపడే వారైతే ఇలా ఆమ్లెట్ తయారుచేసి పెట్టవచ్చు . ఇది ఆరోగ్యకరం మరియు తేలిక పదార్థం కూడ. బేసన్ రిసిపిని రెండు పద్దతుల్లో తయారుచేయవచ్చు. ఫ్రై లేదా రోస్ట్ చేయవచ్చు . ఫ్రై చేయడం వల్ల ఎక్కువ నూనెను ఉపయోగిస్తుంటారు. అదే రోస్ట్ చేస్తే అంత ఎక్కువ నూనె అవసరం ఉండదు. అయితే, ఏలా చేసినా మాడిపోకుండా జాగ్రత్తపడితే చాలు.

బేసన్ ఆమ్లెట్ రిసిపి తయారుచేయడం చాలా సింపుల్. రైస్ తో పాటు ఇటువంటి సింపుల్ ఆమ్లెట్ రిసిపిని మన సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎక్కువగా అన్నం తీనే వారు, ఈ సింపుల్ ఎగ్ ఆమ్లెట్ రిసిపిని ఒక సైడ్ డిష్ గా తీసుకుంటారు. ఈ సింపుల్ బేసిన్ ఆమ్లెట్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Nutritious Besan Omelette Recipe

కావల్సిన పదార్థాలు:

శనగపిండి - 1 1/2cups
టొమాటో - 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - 3-4(సన్నగా తరిగినవి)
అల్లం- కొద్దిగా (తురుముకోవాలి లేదా సన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి - 6(సన్నగా తరిగినవి)
జీలకర్ర - 1tsp
కొత్తిమీర - 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
గుడ్లు- 3

తయారుచేయు విధానం:

1. ముందుగా పచ్చిమర్చి, అల్లం, వెల్లుల్లి ముక్కలను పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగలగొట్టిపోయాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు శెనగపిండి, గ్రైండ్ చేసుకొన్న పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర తరుగు మరియు టమోటో ముక్కలు మొత్తాన్ని గుడ్డు ఉన్న బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పును చిలకరించాలి.
5. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, వేడయ్యాక అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని పాన్ మీద పోసి రౌండ్ గా పాన్ మొత్తం దోసెలా స్ర్పెడ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మంటను మీడియంకు తగ్గించి, బ్రౌన్ కలర్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి శెనగపిండి, గుడ్డు ఆమ్లెట్ రెడీ. దీన్ని ఫోల్డ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి . అవసరం అయితే కెచప్ ను కూడా జోడించి సర్వ్ చేయండి.

English summary

Nutritious Besan Omelette Recipe

Start your day with a healthy meal. This besan omelette recipe is easy to prepare and one of the most loved recipes by all kids. If your kids love eggs, then this recipe is a must. It is healthy and light too. Besan omelette recipe can be prepared in two ways, either fried or roasted. When fried, there is a lot of oil which is used and when roasted, you should be extra careful not to burn it.
Story first published: Tuesday, October 7, 2014, 12:20 [IST]
Desktop Bottom Promotion