ఓట్స్ చికెన్ కట్లెట్

Oats Chicken Cutlet Aid0069

కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ చికెన్: 250grms
ఓట్స్: 2tbsp
బియ్యప్పిండి: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
పచ్చిబఠాణీలు: 2tbsp
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు: 3tbsp
పుదీనా ఆకులు: కొద్దిగా

తయారు చేయు విధానం:
1. మొదటగా చికెన్ శుభ్రం చేసిన తర్వాత చికెన్‌ ను మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసి పేస్ట్‌ లా చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఆ చికెన్ పేస్ట్ లో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి.
3. ఇప్పుడు చిన్నచిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్‌ స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారికి నూనె వాడాల్సిన అవసరం లేదు.
Posted by:
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .