For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పన్నీర్ ఎగ్ కుర్మా

|

మనందరికి తెలుసు గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో. ఇది మన ఆరోగ్యాన్ని పెంచడమే కాదు ఇది చర్మానికి, జుట్టుకు కూడా చాలా ప్రయోజనాల ను అందిస్తుంది. అందుకే ఉడికించిన గుడ్లును తినమని చెబుతుంటారు న్యూట్రిషియనిస్టులు. దాంతో శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. అదే విధంగా, ఉడికించిన గుడ్డును ప్రతి రోజూ తినడం అంటే కొంచెం బోర్ కొడుతుంది. అందుకే కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేసుకొని తినడం వల్ల అదే మోతాదులో పోషకాలను పొందవచ్చు. చాలా మందికి ప్లెయిన్ ఎగ్స్ తినడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా పిల్లలు అసలు ఇష్టపడరు.

కాబట్టి, ఎగ్ కు బెస్ట్ కాంబినేషన్ గా పన్నీర్ ను చేర్చి కుర్మా తయారుచేసుకుంటే మంచి రుచితో పాటు, పోషకాలను కూడా పొందవచ్చు. దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు కొన్ని మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేయడం వల్ల అద్భుతమైన రుచితో పాటు, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. కాబట్టి, ఈ రుచికరమైన పన్నీర్ ఎగ్ కుర్మాను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Paneer Egg Kurma

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడికించి పెట్టుకోవాలి)
ఉల్లిపాయ : 1
టమోటో గుజ్జు: 1/2
వెల్లుల్లి రెబ్బలు: 3-4
అల్లం: కొద్దిగా
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర తరుగు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 1tbsp
పసుపు : కొద్దిగా
ధనియాల పొడి: 1/2tsp
గరం మసాల: 1tsp
వెజిటేబుల్ ఆయిల్ లేదా నెయ్యి 2-3tbsp
పచ్చిబఠానీలు: 1cup లేదా పన్నీర్: 250grms

తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్డును ఉడకబెట్టి, పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, మరియు పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించాలి.
4. ఇప్పుడు అందులోనే మసాలాలు(ఉప్పు, పసుపు, కొత్తిమీర మరియు కారం)గరం మసాలా తప్ప మిగిలిన మసాలాలన్నింటిని వేసి ఒక నిముషం వేగించుకోవాలి. నూనె తేలే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి, నీరు ఇమిరిపోయే వరకూ ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులోనే ముందుగా ఫ్రై చేసుకొన్న పన్నీర్ తురుము లేదా పచ్చిబఠానీలను వేసి బాగా మిక్స్ చేయాలి.
7. కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులోనే ఒక కప్పు నీళ్ళు పోసి బాగా ఉడికించుకోవాలి. దింపుకోవడానికి ముందు 10నిముషాలు సిమ్ లో ఉంచాలి . చివరగా గరం మసాలా మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి పరోటా, రోటి లేదా రైస్ తో సర్వ్ చేయాలి. అంతే పనీర్ ఎగ్ కుర్మా రెడీ.

English summary

Paneer Egg Kurma

We all know that eggs are extremely beneficial for health. Not only it increases our overall health but is also good for our skin and hair. It is often recommended to have boiled eggs as they have more calcium content. At the same time having boiled egg every day can be really boring. However, having eggs with different variety of dishes is something that is popularly followed as just plain eggs are not liked by many, especially kids.
Desktop Bottom Promotion