
కావలసిన పదార్థాలు:
చేపముక్కలు: 8-10
గరం మసాల: 1tsp
శెనగపిండి: 1cup
అల్లంపేస్ట్: 1tsp
వెల్లుల్లిముద్ద: 1tsp
వాము: 1tsp
కారం: 11/2tsp
నిమ్మకాయ: 1
కోడిగుడ్డు: 1
పెరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
చాట్ మసాలా: 2tsp
తయారుచేసే విధానం:
1. చేపముక్కల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేయాలి. ఆ ముక్కల్ని మళ్లీ మధ్యలోకి కోయాలి.
2. తరవాత అల్లం, వెల్లుల్లి, కారం, నిమ్మరసం చేపముక్కలకు పట్టించి అరగంటసేపు నానబెట్టాలి.
3. శెనగపిండిలో కోడిగుడ్డు, పెరుగు, ఉప్పు, వాము వేసి అవసరమైతే కొన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలిపి పెట్టాలి. అరగంట తరవాత చేపముక్కలను శెనగపిండి మిశ్రమంలో వేసి పావుగంటసేపు పక్కనపెట్టాలి.
4. ఇప్పుడు పాన్ స్టౌ మీద పెట్టి అందులోనూనె వేసి బాగా కాగాక, రెండు మూడు చేపముక్కల చొప్పున వేస్తూ డీప్ ఫ్రై చేయాలి.
5. బంగారు రంగులో వేగిన చేపముక్కలను ఓ ప్లేటులో పెట్టి నిమ్మరసం పిండి చాట్ మసాలా చల్లి సర్వ్ చేయాలి అంతే పెషావరీ ఫిష్ ఫ్రై రెడీ.













