For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెషావరీ రాన్: రోస్టెడ్ ల్యాంబ్ లెగ్

|

పెషావరీ రాన్ పేరు చూస్తేనే వింతగా ఉంది అనుకుంటున్నారు. రాన్ రిసిపిలో బార్డర్లలో ఎక్కువగా వండుకుంటారు. ఇండియన్ కాంటినెంటల్ డిష్ లలో ఈ పెషావరీ రాన్ డిష్ మన ఇండియాలోని నార్త్ స్టేట్స్ లో ఎక్కువగా వండుకుంటారు. ముక్యంగా ఈ ఇండియన్ మటన్ రిసి నార్త్ స్టేట్స్ అయినటువంటి పంజాబ్ మరియు కాశ్మీర్లలో ఎక్కువగా పాపులర్ అయినది. నెయ్యి లేదా బటర్ లో ఈ మటన్ రిసిపి వండుటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే విధంగా ఉంటుంది. ఈ వంటను తయారుచేయడానికి మీకు నచ్చిన సైజులో ల్యాంబ్ లెగ్స్ ను కట్ చేసుకోవాలి . గొర్రెకాళ్ళ పొడవుగా ఉంటాయి కాబట్టి రాన్ కట్ చేసుకోవాలి. మరి ఈ పెషావరీ రాన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావల్సిన పదార్థాలు:

గొర్రె కాళ్ళు: 300grams to 500grms
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 అంగుళం
ఏలకులు: 4
పెప్పర్(మిరియాలు): 10
జీలకర్ర : 1tbsp
లవంగాలు: 5
దాల్చిన చెక్క: చిన్న ముక్క
నిమ్మరసం 2tbsp
వెనిగర్: 1tbsp
కారం పొడి 1tbsp
పసుపు:చిటికెడు
మెంతి ఆకులు: 1tbsp
ఉల్లిపాయలు: 1 tsp
పెరుగు: 2tbsp
నెయ్యి (కాచిన వెన్న) లేదా వెన్న: 3tbsp
ఉప్పు : రుచికి సరిపడా

Peshawari Raan: Roasted Lamb Leg

తయారుచేయు విధానం:

1. ల్యాంబ్ కాళ్ళను మీకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. ఇలా చేసుకొన్నప్పుడే మసాలా మొత్తం వీటికి బాగా పడుతాయి.
2. మొత్తం కట్ చేసి పెట్టుకొన్న ల్యాంబ్ లెగ్స్ ను ఒక బౌల్లో వేసి అందులో వెనిగర్, నిమ్మరసం మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. 10 నిముషాల తర్వాత వాటి మీద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసి మరో అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
4. అంతలోపు మిక్సీ జార్ లో జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, పసుపు, మరియు కారం మరియు కొద్దిగా నీళ్ళు పోసి చిక్కటి పేస్ట్ తయారుచేసుకోవాలి.
5. ఈ మసాలా ముద్దకు కొద్దిగా పెరుగు చేర్చి బాగా మిక్స్ చేసి తర్వాత తిరిగి నిమ్మరసంలో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న లాంబ్ లెగ్స్ కు ఈ మసాలా పేస్ట్ పట్టించి 2గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
6. బేకింగ్ డిష్ లో 2టేబుల్ స్పూన్ల బటర్ లేదా నెయ్యిని అప్లై చేయాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న ల్యాంబ్ లెగ్స్ ను అందులో సర్ధాలి.
7. వీటి మీద మూత పెట్టకుండా ఓవెన్ లో 400డిగ్రీల్లో 30నిముషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిముషాల తర్వాత మైక్రోవేవ్ గ్రిల్ ను టర్న్ చేయాలి.
8. అంతలోపు మరో వెడల్పాటి పాన్ లో నెయ్యి లేదా బటర్ వేసి వేడయ్యకా అందులో మెంతి ఆకులు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి.
9. ఇలా ఫ్రై చేసుకొన్న ఉల్లిపాయలు నెయ్యితో పాటు ఓవెన్ లో ఉడికించుకొన్న ల్యాంబ్ లెగ్స్ మీద పోసి మూత పెట్టి 350డిగ్రీల్లో మరో 30నిముషాలు ఉడికించుకోవాలి.
10. తర్వాత 45నిముషాలు అలాగే ఉంచాలి . అంతే పెషావరీ రాన్ రెడీ ఉల్లిపాయ ముక్కలు, నిమ్మముక్కలు, పచ్చిమిర్చి మరియు రుమాలి రోటీస్ తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటాయి.

English summary

Peshawari Raan: Roasted Lamb Leg


 As the name suggests, Raan is a recipe from across the border. Raan, a famous dish in North eastern parts of the Indian continent is basically the leg of a lamb that is cooked in the tandoor. This Indian mutton recipe is very popular in the northern states of Punjab and Kashmir. Cooking the leg of lamb, usually a huge one, in generous portions of butter or ghee is the original and delicious Raan recipe.
Story first published: Tuesday, June 10, 2014, 12:33 [IST]
Desktop Bottom Promotion