For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై : అద్భుతమైన రుచి, ఆరోగ్యం

|

పాంఫ్రెట్ ఫిష్ ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఒక టేస్టీ ఫిష్. సీఫుడ్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ పాంఫ్రెట్ ఫిష్ ను ఎక్కుగా ఇష్టపడుతారు. ఈ న్యూట్రీషియన్ పాంఫ్రెట్ ఫిష్ ను కనీసం వారంలో ఒక్క సారైన రుచి చూడందే వారికి మనస్సు ఊరుకుండదు . ఈ సీ ఫిష్ తో వివిధ రకాల వెరైటీ వంటలను వండుతారు. పాంఫ్రెట్ తో వండే ప్రతి ఒక్క వంటా చాలా టేస్ట్ గా ఉంటుంది.

ఈ రోజు మనకు ఒక స్పెషల్ బెంగాలి ఫిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. దీన్ని తయారుచేయడానికి మస్టర్డ్ సాస్ ఉపయోగించడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అంతే కాదు, దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా త్వరగా తయారవుతుంది. 15శాతం ఫ్యాట్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది. అంతే కాదు జీర్ పర్సెంటేజ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది హార్ట్ పేషంట్స్ కు చాలా మంచిది. మరి ఈ స్పెషల్ పాంఫ్రెట్ ఫిష్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
పాంఫ్రెట్ ఫిస్: 1
ఎల్లో మస్టర్డ్ సీడ్స్ : 2tbsp
వెల్లుల్లి: 5-6
పచ్చిమిర్చి: 3
పసుపు: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1tsp
మస్టర్డ్ ఆయిల్: 2tbsp
కొత్తిమీర: గార్నిష్ కోసం

Pomfret Fish In Mustard Sauce Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా చేపను శుభ్రం చేసి కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి. లేదా ఒక ఫిషే(మీడియం సైజ్) అయితే చేపమీద గాట్లు పెట్టుకొంటే మసాలా బాగా పడుతుంది.
2. తర్వాత ఆవాలు, వెల్లుల్లి, మరియు రెండు పచ్చిమిర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీరు కూడా మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకొన్న చేపకు ఉప్పు పసుపు బాగా పట్టించాలి.
4. తర్వాత పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపను వేసి మీడియం మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. ఒకసారి ఇలా చేసిన తర్వాత చేపముక్కలను ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
6. అదే పాన్ లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి, ఒక నిముషం వేగించుకోవాలి.
7. తర్వాత అందులోనే ఆవాల పేస్ట్, ఉప్పు మరియు పసుపు వేసి, మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి మిక్స్ చేసిన తర్వాత చేప ముక్కలను వేసి నిధానంగా మిక్స్ చేయలి.
9. గ్రేవీ చిక్కబడే వరకూ 5నిముషాలు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
10. స్టౌ ఆఫ్ చేసే ముందుగా చేప మీద మస్టర్డ్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి మరియు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

English summary

Pomfret Fish In Mustard Sauce Recipe

Pomfret fish is a highly nutritious and tasty fish. All fish lovers love to hog on this fish at least once in their lifetime. This sea fish is prepared in a number of ways across India and interestingly, all the recipes taste equally good.
Story first published: Saturday, November 22, 2014, 14:00 [IST]
Desktop Bottom Promotion