For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరగా తయారయ్యే చికెన్ పులావ్ రిసిపి

|

సాధారణంగా పనిచేసే ఉద్యోగస్తులు ఉన్న ఇల్లలో ప్రతి రోజూ ఏదో ఒక వంటకాన్ని అదీ, అతి త్వరగా తయారుఅయ్యే వంటకాలను ఎక్కువగా ఇష్టపడుతారు. టైమ్ సేవ్ చేయడానికి ప్రతి రోజూ అతి త్వరగా తయారైయ్యే వంటకాలను వెదుక్కొంటుంటారు. ముఖ్యంగా మహిళలు ఇట్లో వారికి మరియు అటు ఆఫీస్సుల్లో పని ఒత్తిడితో సతమతమవుతూ సవాలుగా భావిస్తుంటారు. కాబట్టి, మహిళలు ఇంట్లో వారికి తయారుచేసిన తర్వాత మహిళలకొరకు కొన్ని ప్రత్యేకమైన వంటలు, రుచికరమైనవి, ఆరోగ్యకరమైన వంటల మీద ఎక్కువ శ్రద్ద చూపాలి.

అటువంటి వారికోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన వంట ఇవ్వబడింది. అదే చికెన్ పులావ్ రిసిపి, దీన్నీ తయారు చేయాడం చాలా సులభం మరియు చాలా త్వరగా కూడా రెడీ అవుతుంది. వస్తువులు కూడా తక్కువగా ఉపయోగించుకోవచ్చు. అతి త్వరగా తయారుచేయడానికి సిద్దం చేసుకొన్న వస్తువులన్నింటీ ప్రెజర్ కుక్కర్ లో వేసి ఉడికించుకోవడమే. మరి మీరు కూడా దీన్ని తయారుచేయాలంటే క్రింది పద్దతిని ఫాలో అవ్వాల్సిందే...

Quick Chicken Pulao Recipe

రైస్: 2cups(శుభ్రంగా కడిగి, పది నిముషాలు నానబెట్టుకోవాలి)
చికెన్: 250 గ్రాముల(చిన్న ముక్కలుగా లేదా మీడియం సైజులో కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటా: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చి మిర్చి: 2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 1 ½tsp
జీలకర్ర పొడి: 1tsp
కొత్తిమీర పొడి: 1tsp
గరం మసాలా: చిటికెడు
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2tsp
నీళ్ళు: 2 cups

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీద రెండు నిముషాలు వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, వేసి బాగా మిక్స్ చేసి వేగించాలి. తర్వాత టమోటో ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి.
4. టమోటో ముక్కలు కొంచెం మెత్తబడ్డాక అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, వేసి బాగా మిక్స్ చేయాలి.
5. మసాలా మొత్తం బాగా వేగిన తర్వాత అందులో ముందుగా శుభ్రం చేసి, కట్ చేసి పెట్టుకొన్నచికెన్ ముక్కలు వేసి మీడియం మంట మీద పది నిముషాలు వేగించాలి.
6. ఆ తర్వాత శుభ్రం చేసి, కడిగి పెట్టుకొన్న బియ్యం, సరిపడా నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి, విజిల్ పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి. అంతే స్టౌ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత వేడి వేడి గా సర్వ్ చేయాలి.

English summary

Quick Chicken Pulao Recipe

In most of the Indian households, you would working women struggling hard to prepare an easy recipe for breakfast. They are running out of time and women are always a jack of all trade. They look after the home, kitchen and office.
Story first published: Tuesday, September 17, 2013, 12:05 [IST]
Desktop Bottom Promotion