For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రా స్టైల్ ఎగ్ కర్రీ(కోడిగుడ్డు పులుసు)

|

గుడ్డు ఆరోగ్యానికి చాల మంచిది. అది అందరికి తెలిసిన విషయమే. అందువల్లే వివిధ రకాల వంటల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇండియన్ వంటకాల్లో ఎగ్ కర్రీని చాలా సాధారణంగా ఎక్కువగా వండుతుంటారు. ఇది కారంగా రుచిగా ఉండటమే కాదు ప్లెయిన్ రైస్ తో తినడానికి చిక్కటి గ్రేవితో నూరూరిస్తుంటుంది.

ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలలోని ఈ రుచికరమైన వంటకం స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలి అని వుందా? ఐతే ఎందుకు ఆలస్యం క్రింద తెలుపబడిన పద్ధతిని అనుసరిస్తే మంచి ఘుమఘుమలాడే స్పెషల్ ఎగ్ కర్రీ మీ సొంతం. ఈ టమోటో ఎగ్ కర్రీ చపాతీ, రైస్, రోటీలకు చక్కటి కాంబినేషన్.

Quick & Easy Andhra Style Egg Curry Recipe

ముఖ్యంగా గుడ్డుతో తయారుచేసే వంటలను రోజులో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్, మీల్ , డిన్నర్ ఇలా ఎప్పుడైనా తినవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కోడి గుడ్డు పులుసు లేదా ఎగ్ కర్రీ ఆంధ్ర స్టైల్లో ఎలా తయారుచేయాలో చూద్దాం...

Quick & Easy Andhra Style Egg Curry Recipe

Serves: 3
Preparation time: 5 minutes
Cooking time: 20 minutes

Quick & Easy Andhra Style Egg Curry Recipe

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు: 4
ఉల్లిపాయ: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3-4(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటోలు : 2 (సన్నగా కట్ చేసుకోవాలి)
పసుపు: 1tsp
కారం: 2tsp
ధనియాలపొడి: tsp
చింతపండు గుజ్జు: 1tbsp
బెల్లం: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర తరుగు: 2tbsp
నూనె: సరిపడా

Quick & Easy Andhra Style Egg Curry Recipe

తయారుచేయు విధానం:
1. పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మరియు కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
2. వెగిన తర్వాత అందులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, మరియు ధనియాలపొడి వేసి మరో 3నిముషాలు ఫ్రై చేయాలి.
4. ఆ తర్వాత టమోటో ముక్కలు మరియు చింతపండుగుజ్జు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

Quick & Easy Andhra Style Egg Curry Recipe

5. టమోటో మెత్తబడ్డాక అందులో బెల్లం మరియు ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ మరో 5నిముషాలు ఫ్రై చేయాలి.
6. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకొన్న గుడ్లుకు చాకుతో గాట్లు పెట్టి, ఉడికుతున్న గ్రేవీలో వేయాలి. అంతే ఆంధ్రా స్టైల్ ఎగ్ కర్రీ లేద కోడిగుడ్డు పులుసు రెడీ. ఈ స్పెషల్ ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంతో వడ్డిస్తే చాలా రుచికరంగా ఉంటుంది.

Quick & Easy Andhra Style Egg Curry Recipe

న్యూట్రీషియన్ విలువలు: ఎగ్ కర్రీ ఇతర నాన్ వెజ్ వంటలతో పోల్చిచే చాలా హెల్తీ ఫుడ్ . ఎందుకంటే గుడ్డులో న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు, క్యాలరీలు తక్కువ, ప్రోటీనులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తక్కువ నూనెను ఉపయోగించి, ఎగ్ కర్రీని తయారుచేసుకోవచ్చు.

Quick & Easy Andhra Style Egg Curry Recipe

English summary

Quick & Easy Andhra Style Egg Curry Recipe

Andhra recipes are one of a kind. Andhra recipes have a reputation for being super hot and spicy. So if you like your food to be spicy and rich, then you should certainly try some Telugu style recipes. Andhra recipe are sizzling hot and unique in their flavour.
Desktop Bottom Promotion