For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : చికెన్ మలై టిక్కా

|

చికెన్ మలైటిక్కా బెస్ట్ చికెన్ రిసిపి. రంజాన్ నెలలో తయారుచేసుకొని రుచికరమైన స్పెషల్ నాన్ వెజ్ రిసిపి. ఈ మలై చికెన్ టిక్కా రిసిపికి చాలా తక్కువ మసాలాలు తయారుచేస్తారు. ఇది ఎక్కువ క్రీమీ ఫ్లేవర్ తో తయారుచేసే ఈ డిష్ ను రంజాన్ ఉపవాస రోజుల్లో తినడం వల్ల రోజంతా దప్పిక కాకుండా ఉంటుంది.

ముఖ్యంగా చికెన్ మలై టిక్కా రిసిపికి పెరుగు, బట్టర్ మరియు క్రీమ్ ను జోడించడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు ఇది క్యాల్షియం మరియు మంచి ఫ్యాట్స్ ను శరీరానికి అందిస్తుంది . కాబట్టి, ఈ స్పెషల్ టేస్టీ అండ్ ఈజీ చికెన్ మలై టిక్కా రిసిపిని ఈ రంజాన్ సమయంలో తయారుచేసి, నాన్, గీరైస్ తో తీసుకుంటే చాలా అద్బుతంగా ఉంటుంది..

Ramadan special: Chicken Malai Tikka

కావల్సిన పదార్ధాలు:
బోన్ లెస్ చికెన్ బ్రెస్ట్: 1kg
బటర్ : 3tbsp
డబుల్ క్రీమ్: 1tbsp
పెరుగు: 2tbsp
యాలకులు: 5

READ MORE: రంజాన్ విందు బహుపసందు-మొఘలాయ్ మటన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
జాజికాయపొడి: 1tsp(అవసరం అయితేనే)
జీలకర్ర: 2tsp
పచ్చిమిర్చి: 3(సన్నగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 1tbsp
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
సన్నగా తురిమిన చీజ్ : 3tbsp

READ MORE: కల్మీ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్
తయారుచేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసిన చికెన్ ముక్కలను ఒక బౌల్లో తీసుకొని అందులో ఉప్పు మరియు నిమ్మరసం మిక్స్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బట్టర్, క్రీమ్, జీలకర్ర, యాలకలు, జాజికాయ, పచ్చిమిర్చి, చీజ్ మరియు ఆయిల్ ను మిక్స్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు గ్రైండ్ చేసుకొన్న ఈ పేస్ట్ ను చికెన్ కు పట్టించి 1 గంట సేపు మ్యారినేట్ చేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.

READ MORE: ముర్గ్ హరియాలీ చికెన్ రిసిపి: రంజాన్ స్పెషల్
4. ఒక గంట తర్వాత వీటిని బయటకు తీసి ఎలక్ట్రిక్ గ్రిల్లర్ కు గుచ్చి, 15 నిముషాలు ఎలక్ట్రిక్ గ్రిల్లర్ లో పెట్టి 180డిగ్రీలో 15 నిముషాలు గ్రిల్ చేయాలి.
5. చికెన్ ఉడికించేటప్పుడు బటర్ ను అప్లై చేసి బేక్ చేయాలి. అంతే చికెన్ మలై టిక్కా రెడీ.

English summary

Ramadan special: Chicken Malai Tikka: Telugu Vantalu

Chicken malai tikka is the best chicken recipe to have in the holy month of Ramadan as the least amount spices are added in it. It has a rich creamy flavour and can be eaten at sohur as it will not make you thirsty during the day.
Story first published: Friday, June 26, 2015, 14:48 [IST]
Desktop Bottom Promotion