For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : రుయ్ మచర్ కాలియా మిర్చి

|

మచర్ కాలియా అంటే స్పైసీ ఫిష్ కర్రీ. బెంగాల్లో ఇది చాలా ఫేమస్ డిష్. ఇది చాలా అద్భుతమైన రుచికరమైన వంట అందుకే దీన్ని ప్రత్యేకంగా సందర్భాల్లో తయారుచేసుకుంటారు . రహు ఫిష్ బెంగాల్లో చాలా ఫేమస్ ఫిష్ . రుయ్ మచర్ కాలియా అంటే ఫ్లేవర్ ఫుల్ గా మరియు కారంగా ఉల్లిపాయ మరియు టమోటో గుజ్జుతో తయారుచేసుకొనేటటువంటి చిక్కటి గ్రేవీ.

గ్రేవీ చిక్కగా నోరూరిస్తుంటుంది. ఈ ఫిష్ కర్రీలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయి. టేస్ట్ గా కూడా ఉంటుంది. దీన్ని వైట్ రైస్ తో తీసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది.

Ramadan Special: Yummy Rui Macher Kalia Recipe


కావల్సిన పదార్థాలు:
రాహు ఫిష్: 1kg
టమోటో: 1/2kg
ఉల్లిపాయలు: 5
దాల్చిన చెక్క : పెద్దది
పసుపు: 1/2tsp
కాశ్మిర్ రెడ్ చిల్లీ పౌడర్: 1tsp
లవంగాలు: 1tsp
వెల్లుల్లి : 6
అల్లం పౌడర్: 1tsp
యాలకలు: 6tsp
మెంతులు: 1tsp
ఆయిల్ : 5
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా రహు ఫిష్ ను శుభ్రం చేసుకొని, అందులో కొద్దిగా ఉప్పు మరియు కారం, పసుపు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు మరియు టమోటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉప్పు , పసుపుతో మ్యారినేట్ చేసిన ఫిష్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పౌడర్, యాలకలు, లవంగాలు మరియు దాల్చిన చెక్క వేసి ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ను నీరు పూర్తిగా వంపేసి, ఉల్లిపాయ పేస్ట్ ను వేరో పాన్ లోవేసి ఫ్రై చేసుకోవాలి.
5. ఇలా ఫ్రై చేసుకొన్న ఆనియన్ పేస్ట్ ను ఫ్రై అవుతున్న ఫిష్ పాన్ లో వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. కొద్దిసేపటి తర్వాత ఉల్లిపాయ జ్యూస మరియు టమోటో పేస్ట్ వేసి మిక్స్ చేయాలి .
7. మీడియం మంట మీద అరగంట పాటు ఉడికించుకోవాలి. ఫిష్ గ్రేవీ చిక్కబడే వరకూ ఉడికంచుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి, వైట్ రైస్ తో సర్వ్ చేయాలి.

English summary

Ramadan Special: Yummy Rui Macher Kalia Recipe : Telugu Vantalu

Macher Kalia means spicy fish curry in Bengali as it a famous dish there. It is a delicious and popular cuisine prepared during special occasions. Rohu is a famous fish of Bengal. Rui macher kalia is a rich flavoured and spicy Rohu fish made with tomatoes and onions.
Desktop Bottom Promotion