For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్: కాశ్మీర్ మిర్చి కుర్మా రిసిపి

|

కాశ్మీర్ కుషన్స్ లో మిర్చి కుర్మా స్పైసీ మరియు టేస్టీ కుషన్. ఇది ఒక స్పెషల్ డిష్ . అందుకే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. రెడ్ చిల్లీ డిఫరెంట్ టేస్ట్ మరియు కలర్ కలిగి నోరూరిస్తుంటుంది.

కాశ్మిర్ మిర్చి స్టొమక్ అప్ సెట్ మరియు అజీర్ణంకు దారితీస్తుంది, కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. అయితే ఈ రెండ్ చిల్లీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హార్ట్ ను హెల్తీగా ఉంచతుంది మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మరి ఈ కాశ్మీరి డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం....

Ramazan Special: Kashmiri Mirchi Korma Recipe

కావల్సిన పదార్థాలు:
ఎండు మిర్చి(విత్తనాలు తీసేసినవి): 10
ఉల్లిపాయలు: 3 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
జీలకర్ర: 1tsp
మీట్ మసాల: 1tbsp
సోంపు పొడి: 1tbsp
చింతపండు: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
మాంసం: 1Kg
నూనె: సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో సన్నగా తరిగిపెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులోనే మటన్ వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, సోంపు పొడి, జీలకర్ర మరియు మీట్ మసాల పౌడర్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
3.ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు మిక్స్ చేసి 15నిముషాల పాటు ఉడికించుకోవాలి.
4. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ప్రెజర్ కుక్కర్లో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
5. తర్వాత ఒక సపరేట్ బౌల్లో ఎండుమిర్చి వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తబడేవరకూ ఉడికించాలి.
6. తర్వాత నీరు వంపేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
7. ఇప్పుడు మటన్ మిశ్రమంలో చింతపండు పేస్ట్ మరియు చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి.
8. చివరగా కొత్తిమీర తరుగు వేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ రంజాన్ స్పెషల్ డిష్ ను రైస్ తో సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Ramazan Special: Kashmiri Mirchi Korma Recipe : Telugu Vantalu

Mirchi korma is a spicy and tasty kashmiri cuisine. It is a special dish which gives a unique taste of red dried chilies. It aids in digestion and treats stomach upset. If you don't like to eat anything in sehri (dawn time) then try out this tasty mirchi korma. The chilli added in it has many health benefits. It is good for your heart and circulation.
Story first published: Friday, June 19, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion