For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖీమా పకోడ: రంజాన్ స్పెషల్ స్నాక్

|

రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. అటువంటి స్పెషల్ డిష్ లలో కబాబ్ రిసిపిలు మరియు పకోడాలు కూడా ఒకటి.

కబాబ్ రిసిపిలనే కొంచెం వెరైటీగా శెనపిండి చేర్చి పకోడాల కూడా తయారుచేస్తారు . ఈ పకోడ రిసిపిలను టేస్ట్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ ఉంటారు. రంజాన్ సీజన్ మొత్తం ప్రతిఒక్కరి ముస్లీం ఇంట్లోనో ఖీమాతో తయారుచేసే పకోడాలు తప్పకుండా చేస్తారు. అంటువంటి వంటలో మటన్ ఖీమా రిసిపి కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో చూద్దాం...

Ramzan Snack: Kheema Pakora

కావల్సిన పదార్థాలు :
ఖీమా (మటన్): 2 cups(500 గ్రాముల)
ఉల్లిపాయలు: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
పచ్చిమిర్చి: 4 (చిన్న ముక్కలుగా తరిగినవి)
శనగ పిండి: 1cup
టమోటో: 1 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
గరం మసాలా: 1tsp
కబాబ్ మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2cups

తయారుచేయు విధానం:
1. ముందుగా ఖీమా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు టమోటోలు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేయాలి.
2. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి .
3. తర్వాత అందులోనే ఉప్పు, కబాబ్ మసాలా మరియు గరం మసాలా కూడా వేసి బాగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఈ ఖీమా మిశ్రమంలో శెనగపిండి, అరకప్పు నీళ్ళు పోసి పిండిని చిక్కగా కలుపుకోవాలి.
5. తర్వాత చేత్తో కొద్దికొద్దిగా తీసుకొని చిన్న పకోడాలుగా చేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు స్టౌ మీద డీప్ బాటమ్ పాన్ పెట్టి, నూనె కాగిన తర్వాత అందులో పకోడాలను వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
7. మంట తగ్గించి, మూత పెట్టి, అన్ని ఫైపులా ఫ్రై అయ్యే విధంగా 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అంతే ఖీమా పకోడ రెడీ. వీటిని ఆనియన్ రింగ్స్ తో సర్వ్ చేయాలి.

English summary

Ramzan Snack: Kheema Pakora

Ramzan is the time when you will fast from sunrise to sunset and then break your fast with some delicacies. If you have been fasting all day, what would be the first thing on your mind. You will certainly not go for the biriyani.
Story first published: Monday, July 14, 2014, 18:11 [IST]
Desktop Bottom Promotion