రంజాన్ స్పెషల్ గా 10 నోరూరించే నాన్ వెజ్ వంటలు!

Posted By:
Subscribe to Boldsky

రంజాన్ ముస్లింలకు పవిత్రమైన నెల..అత్యంత భక్తి శ్రద్దలతో నియమాలతో ఈ నెలలో ఉపవాసాలు చేస్తారు..సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ మంచి నీరైనా ముట్టరు. అంతే కాదు..ఎదుటి వ్యక్తికి తాము ఉపవాసం ఉన్నట్లు కూడా కనిపించరు. రోజువారీ విధుల్ని మా మూలుగానే నిర్వహిస్తుంటారు. నగర జీవితం బిజీబిజీ..ట్రాఫిక్ లో మరెన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వారు నిత్యజీవినం గడుపుతుంటారు. అందుకే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత బలమైన ఆహారం తీసుకుంటే రోజంతా ఇబ్బంది ఉండదు.

ఎదుటి వారి ఆకలి తెలిసేలా చేసేది ఉపవాసం. అభిమానం అనే ఆకలిని పెంచేది ఇఫ్తార్. రంజాన్ మాసం అంటే తోటి వారిపై ప్రేమ చాటుకునే మాసం. వారిని ప్రేమగా గుండెలకు హత్తుకునే మాసం. ఈ మాసంలో ముస్లింలు ఇతర మతస్తులను ఇఫ్తార్ కు ఆహ్వానిస్తారు. అలాగే ఇతర మతస్తులు వారికి ఇఫ్తార్ విందు ఇస్తారు.
రంజాన్ కు ఒక్క రోజే మిగిలింది. ఈ పదార్థాలతో ఇఫ్తార్ విందు ఇవ్వండి. మీ అభిమానమనే ఆకలిని పెంచుకోండి.

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

రంజాన్ నెలలో చికెన్ హలీమ్ రుచి చూడాల్సిందే...

రంజాన్‌ మాసం అంటే కొన్ని ప్రత్యేక వంటకాలకు ప్రసిద్ధి. హలీమ్‌, ఖర్జూరా, సేమ్యాలు వంటి పదార్థాలు అందరికీ నోరూరిస్తాయి. రంజాను మాసంలో ఎంతో మంది హలీమ్‌ రుచిని ఆస్వాదిస్తునే ఉంటారు. మరి అలాంటి హలీమ్‌కు పెట్టింది పేరు పురానాషహర్‌. అనేక రకాల మసాలాలు, మాంసం, గోధుమ రవ్వ, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్‌ అన్నింటినీ కలిపి చేసే వంటకమే హలీమ్‌. హలీమ్‌ కు ఉన్న ప్రాధాన్యతను బట్టి రంజాన్‌ మాసంలోనే కాకుండా కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఏడాది మొత్తం కాలం దొరికే ప్రాంతాలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు.

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

చిల్లీ గార్లిక్ ప్రాన్ కబాబ్: రంజాన్ స్పెషల్

ప్రాన్ కాబాబ్స్ అంత విరివిగా తయారు చేసుకొనే వంటకం కాదు. కానీ మీరు గ్రిల్డ్ ప్రాన్స్, లేదా తందూరి ప్రాన్స్ వినే ఉంటారు. అయితే ప్రాన్ కబాబ్ కాన్సప్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా తయారు చేయడంలో చాలా ఉత్సాహం ఉంటుంది. దాంతో పాటు కొత్తరుచిని వెంటనే చూడాలని ఆత్రుత కూడా ఉంటుంది. ఈ రంజాన్ సమయంలో అటువంటి కొత్త రుచి ఒకటి ప్రయత్నిస్తే బాగుంటుందనుకొనే వారికి మాంసంకు బదులుగా ప్రాన్స్ ను ఉపయోగించుకోవచ్చు.

 

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

మటన్ షోర్బా హెల్తీ రంజాన్ డిష్

షోర్బా ఇది అరబ్ రిసిపి. ఇది ఒక రకమైనటువంటి మటన్ సూప్. ఇది గల్ఫ్ లో చాలా పాపులర్ అయినటువంటి వంటకం. ఈ అరబ్ వంటకాన్ని మన స్టైల్ లో తయారు చేయబడింది. రంజాన్ మాసంలో ముస్లీంలు దీన్ని తీసుకోవడం హెల్తీగా భావిస్తారు. షోర్భా ప్రథమికంగా మటన్ సూప్. దీన్ని లెబాన్సే బ్రెడ్(కాబూస్)తో తీసుకుంటారు. మనం కూడా ఈ షోర్బాను ఇండియన్ బ్రెడ్ గా పిలుచుకొనే రోటీతో తినవచ్చు.

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

బీఫ్ కట్ లెట్: స్పెషల్ రంజాన్ రిసిపి
తెలుగులో..అతిథి దేవుడితో సమానమైతే...ఉర్దూలో ‘మోహమాన్ నవాజీ'. భాష ఏదైనా భావం ఒక్కటే...ఉర్ధూలో ‘దస్తరే'...తెలుగులో విస్తరి. మతాలు వేరైనా దైవం ఒక్కడే. సంస్క్రుతి ఏదైనా సంప్రదాయం ఒక్కటే. దేవం ఎవరైనా ఆరాధన ఒక్కటే. మరి ఈ రంజాన్ వేళ దస్తర్(విస్తరి)రుచులు చూపించాలంటే కొంచెం వెరైటీగా ఏదైనా వండాల్సిందే...

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

రంజాన్ విందు బహుపసందు-మొఘలాయ్ మటన్ బిర్యాని

రంజాన్ అంటే ఆ నెల మొత్తం ముస్లీములు ఉపవాస దీక్షలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండే వీరికి సాయంత్రం ఉపవాసం తీర్చుకొనే సమయం. అందుకోసం వివిధ రకాల అద్భుతమైన వంటలు, ప్రతి ముస్లిం ఇంట్లోనూ అలరిస్తుంటాయి. అటువంటి స్పెషల్ డిష్ లలో మొఘలాయ్ మటన్ పులావ్ ఒకటి. మొఘల్ కాలం నాటి రాయల్ ఫ్యామీలీ నుండి వచ్చిన ఈ మొఘలాయ్ పులవ్ ను ఇండియన్స్ తమదైన స్టైల్లో వండుతున్నారు. మొఘలాయ్ మటన్ పులవ్ కడుపు నింపు రైస్ డిస్. దీన్ని రోజంతా ఉపవాస దీక్ష ఉండే వారు హెవీ డిన్నర్ గా తీసుకోవచ్చు. అందుకే దీనికి గ్రేట్ రంజాన్ రిసిపి అని పేరు వచ్చింది.

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్-రంజాన్ స్పెషల్
క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఇన్ స్టాంట్ గా తయారు చేసుకొనే, నోరూరించే నాన్ వెజిటేరియన్ రిసిపి. రంజాన్ వేళలో ఉపవాసం ఉండే వారు ఎక్కువగా నాన్ వెజ్ ను ఇష్టపడుతారు. అందుకే ఈ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ లెగ్స్ ను రంజాన్ రిసిపిగా తయారు చేసుకుంటారు.

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

హరియాలీ చికెన్ కబాబ్ రిసిపి: రంజాన్ స్పెషల్

హరియాలి చికెన్ కబాబ్ ట్రెడిషినల్ స్టాటర్ డిష్. ఇది రంజాన్ కు చాలా ఫర్ ఫెక్ట్ రిసిపి. ఈ గ్రీన్ అండ్ స్పైసీ హరియాలి చికెన్ కబాబ్స్ పంజాబీ రెస్టారెంట్స్ మరియు డాబాల్లో ఎక్కువగా తయారు చేస్తుంటారు. మరి ఈ అద్భుతమైన కబాబ్ రిసిపిలను ఇంట్లో ఎలా తయారు చేస్తారు?

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

లిప్ చేయ్..టేస్ట్ చేయ్-చికెన్ జల్ ఫ్రాజి: రంజాన్ స్పెషల్

చికెన్ జాల్ ఫ్రీజ్ స్పెషల్ రంజాన్ రిసిపి. రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉంటారు. కాబట్టి నెలరోజుల పాటు ఒక్క స్పెషల్ డిష్ ఉంటే చాలా బాగుంటుందనుకుంటారు. ఇలా కొంచెం వెరైటీగా స్పెషల్ గా వండుకు తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. అటువంటి స్పెషల్ డిష్ లలో ఇటువంటి చికెన్ కర్రీలో చాలా స్పెషల్. ఈ వంటకం పాకిస్తాన్ వంటకమైనా..అయితే ఇంట్లో తయారు చేసుకొనే వంటగా ఒక హోం మేడ్ రిసిపిగా కరాచీ నుండి మనకు పరిచయం అయినది. ఈ చికెన్ జాల్ ఫ్రీజ్ ను రంజాన్ స్పెషల్ గా ప్రయత్నించవచ్చు.

 

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

చికెన్ పెషావర్ స్పెషల్ ట్రీట్ ఫర్ రంజాన్
చికెన్ పెషావర్ చాలా సింపుల్ డిష్. రోజంతా ఉపవాసం ఉండే వారికి ఒక రుచికరమైన ట్రీట్ ఈ చికెన్ పెషావర్. ఎక్కువ శ్రమపడకుండా చాలా సులభంగా తయారు చేసేసుకోవచ్చు ఈ చికెన్ పెషావర్. చికెన్ ను పెరుగు మరియు ఇతర కొన్ని మసాలా దినుసులతో మ్యారినేట్ చేసి తర్వాత తయారు చేస్తారు.

10 పాపులర్ చికెన్ రిసిపిలు-రంజాన్ స్పెషల్

హరియాలి మటన్ కర్రీ :రంజాన్ స్పెషల్

మీ వంటలు ఒకే టేస్ట్ ఒకటే కలర్...బోర్ కొడుతోందా!అయితే కొంచెం డిఫరెంట్ కలర్ లో, డిఫరెంట్ టేస్ట్ తో తయారు చేసుకుందాం . హరియాలీ మటన్ కర్రీ, లేదా హరియాలీ గోస్ట్ గ్రీన్ కలర్ లో క్రీమీక్రీమీగా నోరూరిస్తున్న ఈ ఒక ట్రెడిషినల్ మొఘలాయ్ రిసిపి. ఈ రాయల్ మటన్ రిసిపి చాలా ఫేమస్ రిసిపి మరియు క్రీమీ డిలైట్.

 

English summary

Ramzan Special Non Veg Recipes

The holy month of Ramzan is upon us and the spirit of penance rules the atmosphere. But let us not forget that Ramzan is a time when we fast as well as feast. At the end of the day, when you open your Ramzan fast, you would like to get treated by some delicacies. And you would like to make your meals more pleasurable, so we bring you special chicken recipes for Ramzan.
Story first published: Wednesday, August 7, 2013, 17:48 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter