For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముర్గ్ బదామి: రంజాన్ స్పెషల్

|

రంజాన్ అంటేనే వివిధ రకాల నాన్ వెజ్ రుచులను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయడమే. ఎందుకంటే ఫాస్టింగ్ ఎంత ముఖ్యమో ఫీస్టింగ్ కూడా అంతే ముఖ్యం. ఈ రంజాన్ సీజన్ లో వివిధ రకాల రుచులను చూడటానికి చాలా కోరిక కలిగి ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండటం ఎంత కష్టమో, సాయంత్రం ఉపవాసం తీర్చుకోవడానికి రుచికరమైన వంటలను తినడానికి అంతే ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు.

రంజాన్ సీజన్ లో తయారుచేసే మాంసాహారాల్లో ఒక స్పెషల్ రిసిపి ముర్గ్ బదామీ ఒకటి. చికెన్ వంటలను వివిధ రకాలుగా తయారుచేస్తారు . ఇలా పండుగ సమయంలో స్పెషల్ గా తయారుచేసుకొనే వంటలను టేస్ట్ చూడటానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. రంజాన్ సీజన్ మొత్తం ప్రతిఒక్కరి ముస్లీం ఇంట్లోనో చికెన్ తో వివిధ రకాలా వంటలు తప్పకుండా చేస్తారు. అంటువంటి వంటలో బాదామి చికెన్ రిసిపి కూడా ఒకటి. మరి దీన్ని ఎలా తయారుచేస్తారో చూద్దాం...

Ramzan Special Recipe: Murgh Badami

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
నిమ్మరసం: 2tbsp
కారం పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
చిక్కటి పెరుగు: 3tbsp
గరం మసాలా పొడి: 1tsp
ఉల్లిపాయలు: 3(చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
గ్రీన్ యాలకలు: 4
దాల్చినచెక్క: 1
లవంగాలు: 5
బే పాలు: 1
పంచాదర: 1tsp
బాదాం : 1/2(రాత్రిపూట నానబెట్టి, ఒలిచినవి)
పసుపు: చిటికెడు
జాజికాయ చిటికెడు
నెయ్యి / నూనె: 3tbsp
కొత్తిమీర: 2tbsp
బాదాం: గార్నిషింగ్ కోసం (సన్నగా కట్ చేసుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత బాదంకు కొద్దిగా పాలు మిక్స్ చేసి చిక్కటి పేస్ట్ గా తయారుచేసుకోవాలి.
3. తర్వాత చికెన్ ముక్కలను ఒక పెద్దగిన్నెలో వేసుకొని అందులో పెరుగు, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి చికెన్ ముక్కలకు పట్టే విధంగా మిక్స్ చేయాలి. తర్వాత ఫ్రిజ్ లో పెట్టి 5-6గంటలు అలాగే ఉండనివ్వాలి.
4. ఐదు, ఆరుగంటల తర్వాత నూనె లేదా నెయ్యిని పాన్ లో వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు మరియు పంచదార వేసి ఒక నిముషం మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించి, తర్వాత అందులో అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి మరో 2, 3నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను మాత్రమే వేయాలి. మిగిలిన మారినేషన్ మిశ్రంను అదే గిన్నెలో అలాగే పక్కన పెట్టుకోవాలి.
8. తర్వాత చికెన్ ముక్కలను 7-8నిముషాలు ఫ్రై చేయాలి.
9. దాని తర్వాత మారినేడ్ మిశ్రమాన్ని , బాదం పేస్ట్, ఉప్పు, జాజికాయ పొడి, గరం మసాలా పౌడర్ వేసి మరో 5నిముషాలు ఉడికించాలి.
10. ఇప్పుడు పాన్ లో నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
11. పాన్ మూత పెట్టి, చికెన్ ను 15-20నిముషాలు ఉడికించుకోవాలి.
12. ఒకసారిగా చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌను ఆఫ్ చేసేయాలి.
13. చివరగా కట్ చేసిన బాదం మరియు కొత్తిమీర తరుగుతో చికెన్ ను గార్నిష్ చేయాలి. అంతే అద్భుతమైనటువంటి చికెన్ ముర్గ్ బాదామీ రిసిపి రెడీ ఈ స్పెషల్ చికెన్ రిసిపిని రోటీ పులావ్ తో ఎంజాయ్ చేయవచ్చు.

English summary

Ramzan Special Recipe: Murgh Badami

It's time for the Iftar dinner and we are sure you are gearing up with the preparations. To lend a hand, we have a delicious and royal recipe today for you which is known as Murgh Badami. This special chicken recipe for Ramzan is one of the most delectable dish that you can taste during Iftar.
Story first published: Friday, July 18, 2014, 17:26 [IST]
Desktop Bottom Promotion