For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రంజాన్ స్పెషల్ : స్టఫ్డ్ రోస్ట్ చికెన్ దజాజ్

|

రంజాన్ మాసంలో ముస్లీంలు వివిధ రకాల మాంసాహార వంటలను తయారుచేసుకుంటారు. అయితే రెగ్యులర్ గా తయారుచేసుకొనే వంటలు కాకుండా, కొంచెం డిఫరెంట్ గా తయారుచేసే వంటలు చాలా అద్భుతంగా రుచికరంగా నోరూరిస్తుంటాయి.

అలాంటి స్పెషల్ వంటలో మీకోసం ఈ రోజు ఒక స్పెషల్ వంటను పరిచయం చేస్తున్నాము స్టఫ్డ్ రోస్ట్ చికెన్ దాజాజ్. ఇది రంజాన్ మాసంలో తయారుచేసుకొనేటటువంటి ఒక పాపులర్ రిసిపి. సౌదీ ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా వండుకుంటారు.

ఈ స్టఫ్డ్ చికెన్ రిసిపి స్వీట్ అండ్ సావరీ టేస్ట్ కలిగి ఉంటుంది. మరియు ఈ వంటకోసం ఉపయోగించే మసాలాలు చాలా వెరైటీగా అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటాయి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

ramzan-special-stuffed-roast-chicken-dajaj

చికెన్ - 500 gms
వైట్ రైస్ - 2 cups (cooked)
రెడీ మేడ్ మీట్ ఫ్లేవర్ - 1 tbsp
బట్టర్ - 2tbsp
బాదం - 1/4th cup(స్కిన్ అవుట్ అండ్ రోస్ట్ చేసినది)
టమోటో గుజ్జు - 2 tsp
ఉల్లిపాయలు - ¼ cup (సన్నగా తరిగినవి)
లవంగాలు- 3
కుంకుమపువ్వు- 1 tsp
బ్లాక్ పెప్పర్ - 1 tsp
ఎండు ద్రాక్ష - 1/4 cup
శెనగలు- 50 gms
ఉప్పు: రుచికి సరిపడా
ఆలివ్ ఆయిల్ - 2 tbsp

ramzan-special-stuffed-roast-chicken-dajaj

తయారుచేయు విధానం:
1. ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
2. తర్వాత అందులో ఉల్లిపాయలు, చికెన్ వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత కుంకుమపువ్వు, ఉప్పు మరియు పెప్పర్ చిలకరించి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత రైస్, బాదం, మరియు ద్రాక్ష మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత మరో రోస్టింగ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా బటర్ అప్లై చేయాలి .
6. ఇప్పుడు అందులో ఫ్రై చేసుకొన్న చికెన్ రైస్ మిశ్రం వేసి కొద్దిగా నూనె వేయాలి .
7. తర్వాత రైస్ ను చికెన్ లో రైస్ మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి. చేసిన తర్వాత మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించుకోవాలి.
8. కొద్దిగా వెల్లుల్లిని కచపచా దంచి రైస్ స్టఫ్డ్ చికెన్ మీద చిలకరించాలి.
9. తర్వాత మరొకొన్ని ఫ్రై చేసిన చికెన్ ముక్కలు పాన్ లో సర్ధుకోవాలి .
11. చివరగా చికెన్ మీద పెప్పర్ పౌడర్ చిలకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి. చికెన్ ను కనీసం 1గంట పాటు మీడియం మంట మీద ఉడికించడం వల్ల బాగా ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది.

English summary

Ramzan Special: Stuffed Roast Chicken Dajaj: Telugu Vantalu

Chicken recipes are sinfully delicious and when its Ramadan time, you can definitely afford to add the extra calories without giving a second thought. Fried chicken recipes are especially delectable and heavy but who cares when its tasty!
Story first published: Saturday, June 27, 2015, 14:38 [IST]
Desktop Bottom Promotion