For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యాంగో ఫిష్ కర్రీ-ఇంటిల్లిపాదికి నోళ్ళు ఊరాల్సిందే...

|

లేత మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాక మరో కూరగాయ ఏదైనా వంటింట్లోకి రావాలంటే వెనకా ముందు చూసుకోవాల్సిందే!

ఏ కూర వండినా మామిడికాయను జత చేస్తే కొత్త టేస్ట్‌తో ఇంటిల్లిపాది నోళ్లు ఊరాల్సిందే! క్యాలీఫ్లవర్, పచ్చిబఠాణీలు, రొయ్యలు, బొమ్మిడాయిలు... వెజ్‌తోనూ... నాన్‌వెజ్‌తోనూ... నైస్‌గా కలిసిపోయే మామిడి రుచులను ‘పుల్లపుల్లగా... జిల్లుగా... ఫుల్'గా అందించండి...

మామిడిలో ఐరన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత పోగొడుతుంది. ‘సి' విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి సమ్మర్ సీజన్ లో దొరికే పచ్చిమామిడికాయలను మీ వంటకాలల్లో చేర్చేయండి అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యాన్ని పొందండి...

Raw Mango Fish Curry

చేపముక్కలు: 1/2
పచ్చిమామిడికాయ: ఒక కాయలో సగం
ఉల్లిపాయలు: 3
పచ్చిమిర్చి: 6-8
కొబ్బరి పాలు:( పచ్చికొబ్బరి తురుమును మిక్సీలో పేస్ట్ చేసి నీళ్ళు పోసి వడగట్టుకోవాలి)
పసుపు: 1/4
కారం: 1
నూనె: 4
ఆవాలు: 1
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీర: ఒక కట్ట
అల్లం లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ : చిన్న ముక్క
జీలకర్రపొడి: 1/2
ఉప్పు: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఓ వెడల్పాటి గిన్నెలో నూనె వేసి వేడయ్యాకా అందులో ఆవాలు, కరివేపాకు , పేస్ట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగించాలి.
3. ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించి, కొబ్బరి పాలు మరియు కొద్దిగా నీళ్ళు పోసి పులుసులా చేసుకోవాలి. కొబ్బరి పాలు వేయడం వల్ల గ్రేవీ చిక్కగా మారుతుంది. రుచిగా కూడా ఉంటుంది.
4. ఇప్పుడు అందలో పుల్లని మామిడి ముక్కలను వేసి ఉడికించాలి.
5. చివరగా చేపముక్కలను కూడా వేసి తక్కువ మంట మీద 15నిముషాలు ఉడికించాలి. మద్యలో ఒకసారి ఉప్పు సరిచూసుకోవాలి.
6. మ్యాంగో చికెన్ కర్రీని క్రిందికి దించే ముందు సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు వేసి, క్రిందికి దించి వేడి వేడిగా వడ్డించాలి. అంతే మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ..

English summary

Raw Mango Fish Curry

Sweet and sourness of mango combined with fleshy fish pieces. This is a traditional fish curry of Kerala which is spicy, sour and flavorful and raw mango is used as flavoring and souring agent instead of tamarind or kudampuli.
Story first published: Tuesday, April 23, 2013, 16:24 [IST]
Desktop Bottom Promotion