For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెడ్ చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్: నాన్ వెజ్ స్పెషల్

|

మీరు స్పైసీగా ఏదైనా తినాలనుకుంటున్నారా? మరి అయితే ఈ హాట్ అండ్ స్పైసీ రెడ్ చిల్లీ చికెన్ ను ట్రై చేయండి. ఈ నోరూరించే రెడ్ చిల్లీ చికెన్ తయారుచేయడానికి బోన్ లెస్ చిక్ అయితే బాగుంటుంది.

చికెన్ ఉడికించి, కొన్ని మసాలా దినుసులు ఫ్రై చేసి, అందులో చికెన్, రైస్ వేసి చాలా సింపుల్ గా వండుతారు. ఈ స్పైసీ చికెన్ రిసిపిని మీరు కూడా రుచి చూడాలంటే, ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం...

Red Chilli Chicken Fried Rice Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grms
బియ్యం: 2cups(శుభ్రం చేసి పెట్టుకోవాలి)
ఎండు మిర్చి: 4
కారం: 1tbsp
టమోటో: 1(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
ఉల్లిపాయ: 1(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం&వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు: 1tsp
ధనియాలపొడి: 1tsp
ఆవాలు: 1tsp
మసాలాలు: 1tsp(2యాలకలు, లవంగాలు4, దాల్చిన చెక్క)
నీళ్ళు: 2cups
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా ప్రెజర్ కుక్కర్ లో, కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు అందులో ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్ , మసాలాలు వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
2. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
3.అ లాగే సన్నగా తరిగిన టమోటో ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తుంటే, టమోటో మెత్తబడి, చిక్కటి గ్రేవీలా తయారవుతుంది.
4. ఇప్పుడు అదే కుక్కర్లో కారం, ధనియాలపొడి, పసుపు, వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసి రెండు మూడు నిముషాలు మూత పెట్టి ఉంచాలి.
5. 5నిముషాల తర్వాత మూత తీసి అందులో ఉడికించుకొన్న చికెన్ ముక్కలు వేసి, మిక్స్ చేసి, మసాలాల్లో చికెన్ ను కొద్ది సమయం ఉడికించుకోవాలి.
6. ఇప్పుడు అందులో నీళ్ళు, ఉప్పు, బియ్యం వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి మూత పెట్టాలి.
7. నాలుగు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకొని తర్వాత స్టౌను ఆఫ్ చేసుకోవాలి.
8. కొద్దిసేపటి తర్వాత స్టై మీద నుండి కుక్కర్ ను క్రిందికి దింపుకొని, మూత తీసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే రెడ్ చిల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ...

English summary

Red Chilli Chicken Fried Rice Recipe

If you want to eat something spicy and delicious this afternoon, then this is a must try. To prepare this mouthwatering chilli chicken fried rice recipe, you will need only breast chicken since it is boneless.
Desktop Bottom Promotion