For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షహీ మటన్ కుర్మా రిసిపి: రంజాన్ స్పెషల్

|

ప్రస్తుతం రంజాన్ సీజన్. ఈ నెలలో మేము మీకోసం వివిధ రకాల మాంసాహార వంటలను పరిచయం చేస్తున్నాము. ఇవి చాలా డిఫరెంట్ రుచిని కలిగి ఉంటాయి. వివిధ మాంసాహార వంటల్లో షహీ మటన్ కుర్మా రిసిపి కూడా ఒకటి . ఇది ఒక రాయల్ కిచెన్ వంట, ఇది నిజామ్ ల కాలం నాటి అద్భుతమైన రుచికరమైన వంట. షహీ మటన్ కుర్మాను ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఈ రంజాన్ సీజన్ లో దాదాపు అందరు ముస్లీముల ఇల్లలోనూ మటన్ కుర్మాను వండుతారు. ఈ షహీ మటన్ కుర్మా చాలా డిఫరెంట్ కలర్ మరియు ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ మటన్ కుర్మా లైట్ గా వైట్ అండ్ ఎల్లో కలర్లో నోరూరిస్తూ ఉంటుంది. ఇలా తయారవడానికి ిందులో వేసి పెరుగు మరికు ఫ్రెష్ క్రీమ్ వల్ల ఈ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది. మరి ఈ ఇప్తార్ మీల్ కు మీరు కూడా ఒక అద్భుతమైన రుచికలిగి రాయల్ వర్షన్ వంటను రుచి చూడాలంటే షహీ మటన్ కుర్మాను తయారుచేయు విధానం తెలుసుకోవాల్సిందే.

Shahi Mutton Korma Recipe For Ramadan

కావల్సిన పదార్థాలు:
మటన్: 500gms (బోన్ లెస్)
ఉల్లిపాయలు: 2 (పెద్దవి, కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ పేస్ట్: 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కుంకుమపువ్వు: చిటికెడు
పాలు: 1tbsp అంతలోపు
ఉప్పు : రుచకి సరిపడ
ఫ్రెష్ క్రీమ్: 1cup
బాదం పేస్ట్: 1tbsp
పెరుగు: ½cup
ధనియాల పొడి: 1tsp
బ్లాక్ పెప్పర్ పొడి: 2tsp
గరం మసాలా: 1tsp
నూనె: 2tbsp
వెచ్చని నీరు: 1cup
కొత్తిమీర తరుగు: 2tbsp (సన్నగా తరిగినవి, గార్నిషింగ్ కోసం)

తయారుచేయు విధానం:
1. ముందుగా వేడిపాలలో కుంకుమపువ్వు వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
2. తర్వాత మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ధనియాలపొడి, బాదాం పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అల్లం, వెల్లుల్లిపేస్ట్ మరియు కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
4. రెండుగంటల తర్వాత పాన్ లో నూనె వేసివేడి చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, మీడియం మంట మీద 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలను వేసి 15-20నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో పెప్పర్ పౌడర్, గరం మసాలా, పాలలో నానబెట్టి కుంకుమపువ్వు, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
7. తర్వాత ఒక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ వేసి స్పూన్ తో బాగా గిలకొట్టాలి. ఈ చిక్కటి క్రీమ్ ను పాన్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం కలగలపుకోవాలి.
8. తర్వాత అందులోనే గోరువెచ్చని నీటిని కూడా పోసి మూత పెట్టి 30నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
9. తర్వాత మూత తీసి మటన్ ముక్కలు పూర్తిగా ఉడికినట్లు నిర్ధారించుకొన్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి షహీ మటన్ కుర్మాను సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే మటన్ షహీ కుర్మా రెడీ.

English summary

Shahi Mutton Korma Recipe For Ramadan

Ramadan is a month of festivities and mouthwatering delicacies. After a day long fast, the tempting food is sure welcome. So, here is a special and a royal Ramzan recipe for you to try which will take your taste-buds on a joyful ride.
Story first published: Wednesday, July 16, 2014, 12:29 [IST]
Desktop Bottom Promotion