For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ ఎగ్ మసాల కర్రీ రిసిపి

సింపుల్ ఎగ్ మసాల కర్రీ రిసిపి

|

సాధారణంగా గుడ్లతో వివిధ రకాల వంటలను తయారుచేయవచ్చు. ముఖ్యంగా గుడ్డుతో తయారుచేసే వంటలను రోజులో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్, మీల్ , డిన్నర్ ఇలా ఎప్పుడైనా తినవచ్చు . గుడ్డును పగులగొట్టి, ఎగ్ బుర్జు, ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ తయారుచేసుకుంటాము. అలాగే ఉడికించిన గుడ్డుతో వివిధ రకాల వంటలను కూడా తయారుచేస్తారు.

అందుకే వంటల్లో గుడ్డుతో తయారుచేసే వంటలు ఒక సూపర్ డిష్ గా ఉంటుంది. ఉడికించిన గుడ్లును ఫ్రై చేసి, వివిధ రకాల మాసాలా దినుసుల పేస్ట్ తో చిక్కటి గ్రేవి తయారుచేసి అందులో గుడ్లను జోడించి తయారుచేసి ఈ ఎగ్ మసాల కర్రీ చాలా టేస్ట్ గా నోరూరిస్తుంటుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Simple Egg Masala Curry Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4
ఉల్లిపాయలు: 2
గరం మాసాలా పౌడర్ : 1tsp
పోపుదినుసులు: 1tbsp
నూనె: సరిపడా
కారం: 1tsp
పసుపు: 1tsp
మిరియాలపొడి: 1tsp
కొత్తిమీర: రెండు రెమ్మలు
మసాలా తయారికోసం:
టమోటో: 2
ఉల్లిపాయ: 1
దాల్చిన చెక్క: 4
ఎండు మిర్చి: 5-6
ధనియాలు: 1tsp
గసగసాలు: 1tsp
యాలక్కి: 1
జీలకర్ర: 1tsp

తయారుచేయు విధానం:
1. ముందుగా గుడ్లను నీటిలో పెట్టి కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద ప్రైయింగ్ పాన్ పెట్టి అందులో దాల్చిన చెక్క, ధనియాలు, లవంగాలు, ఎండు మిర్చి, సోంపు, గసగసాలు వేసి రెండు నిముషాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకొని పక్కకు తీసి చల్లారబెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో కొ్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమోటో ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పుడు ముందుగా వేగించుకొన్న పదార్థాలు మిక్సీ జార్ లో వేసి, వాటితోపాటు, వేగించుకొన్న టమోటో, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా రెడి చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి.
6. తర్వాత గుడ్లకు డొల్ల తిసి చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి.
7. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడయ్యాక గాట్లు పెట్టిన గుడ్లు వేసి, రెండు నిముషాలు వేగించాలి. తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు నిముషాల పాటు ఫ్రై చేసి, తర్వాత మిరియాల పొడి వేసి ఒకనిముషం వేగించి మరో ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు అదే నూనెలో పోపు దినుసులు వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి వేగించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు నిముషాలు వేగించుకోవాలి.
9. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో ముందుగా పేస్ట్ చేసుకొన్న మసాలాను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పు, కొద్దిగా కారం, పసుపు వేసి మొత్తం మిశ్రామన్ని చిక్కగా అయ్యే వరకూ 5నిముషాలు వేగించుకోవాలి.
10. మొత్తం మసాలా దగ్గర పడిన తర్వాత వేగించి పెట్టుకొన్న గుడ్లను వేసి మసాలాతో తక్కువ మంట మీద వేగించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగును చిలకరించి స్టౌ ఆఫ్ చేయాలి. సర్వ్ బౌల్లో తీసుకోవాలి. రైస్ తో సర్వ్ చేయాలి. అంతే సింపుల్ అండ్ రుచికరమైన ఎగ్ మసాలా ఫ్రై రెడీ, దీన్ని సైడ్ డిష్ గాను మరియు మెయిన్ డిష్ గాను తీసుకోవచ్చు.

English summary

Simple Egg Masala Curry Recipe

Egg curry is one of the best side dishes prepared with the superfood. Boiled eggs are fired and then mixed with the curry that is rich in spices and aroma. The taste and aroma of fried eggs makes the curry taste all the more delicious.
Desktop Bottom Promotion