For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆకుకూర చికెన్ కర్రీ: హెల్తీ నాన్ వెజ్ రిసిపి

|

స్పినాచ్(ఆకుకూర)చికెన్ చాలా రుచికరంగా హెల్తీగా ఉండే వంట. ప్రోటీలను అధికంగా ఉండే ఈ వంటను సులభంగా తయారుచేయవచ్చు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఇటువంటి వంటలను ప్రయత్నించి కొత్త రుచులను ఆశ్వాదించవచ్చు. ఆకుకూరలు కాంబినేషన్లో మాంసాహారాలను వండటం ఇండియాలో చాలా పాపులర్. ఎందుకంటే ఇండియాలో ఆకు కూరాలో ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కానీ చాలా మంది వారి డైట్ లో నుండి ఆకుకూరను తీసేసుంటారు. కొందరి రుచి నచ్చదు, కొందరి రంగు నచ్చదు. మరికొందరి రెండూ నచ్చవు. అటువంటి వారు వీటిలోని ప్రోటీనుల గురించి తెలుసుకుంటే , ఆకు కూరలను తినడం అలవాటు చేసుకోకుండా ఉండలేరు.

ఆకు కూరలు, చికెన్ కాంబినేషన్ లో తయారుచేసే వంటలు పెద్దలతో పాటు, పిల్లలు కూడా ఇష్టపడుతారు. ఆకు కూరలు ఇష్టపడని వారికి ఇటువంటి కాంబినేషన్ తో తయారుచేసి వండిస్తే, వారికి అందాల్సిన న్యూట్రీషియన్స్ ను అందించిన వారు అవుతారు. స్పినాచ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని రోటీలు మరియు రైస్ తో పాటు వడ్డించవచ్చు. మరి ఈ హెల్తీ స్పినాచ్ చికెన్ కర్రీనీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Simple To Make Spinach Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1 kg (కావల్సిన సైజులో కట్ చేసి, ఉడికించి పెట్టుకోవాలి)
ఆకు కూర: 1కట్ట
ఉల్లిపాయ: 1 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 3-4 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కారం: 1tbsp
గరం మసాలా: 1tbsp
ధనియాల పొడి 1tbsp
జీలకర్ర పొడి: 1tbsp
యాలకలు: 3- 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
ఆయిల్ : తగినంత
ఉప్పు : రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ తీసుకొని అందులో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిసేపు వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా వేగుతున్నప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్త మిశ్రమాన్ని మరో 5నిముషాలు వేగించుకోవాలి.
2. ఇప్పుడు అందులో యాలకలు, మరియు దాల్చిన చెక్క కూడా వేసి మిక్స్ చేస్తూ సువాసన వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వత టమోటో ముక్కలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
4.మొత్తం మిశ్రమం బాగా వేగిన తర్వాత, అందులో ముందుగా కట్ చేసి ఉడికించి పెట్టుకొన్న చికెన్ ముక్కలు, కారం, గరం మసాలా, ధనియాలపొడి, జీలకర్ర, ఉప్పు, మరియు ఆకుకూర (మీకు నచ్చిన ఆకుకూరను ఎంపిక చేసుకోవచ్చు)తరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసి, తర్వత రెండు కప్పులు నీళ్ళు పోయాలి.
5. మూత పెట్టి, 5-10నిముషాలు మీడియం మంట మీద మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి . చికెన్ కర్రీ చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి అంతే ఆకుకూర చికెన్ కర్రీ రెడీ. ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీ డిష్ ...

English summary

Simple To Make Spinach Chicken Curry Recipe

Spinach chicken curry is a simple dish that is loaded with proteins. It is the ideal dish to make on a weekday. Spinach chicken recipe is popular in India because spinach is available in abundance here. But many choose to skip spinach in their diet because of its bitterness.
Story first published: Wednesday, November 19, 2014, 12:47 [IST]
Desktop Bottom Promotion