For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సింపుల్ సౌత్రన్ చికెన్: ఫాదర్స్ డే స్పెషల్

|

ఈ ఫాదర్స్ డే రోజును మీ ఫాదర్ ను ఆశ్చర్య పరచడానికి, మీ ఫాదర్ కు ఇష్టమైన వంటలు వండి పెట్టడమే. అందులోనూ చాలా రుచికరమైనవి, నోరూరించేవి అంటే ఇక అంతే మీ మీద అతనికున్న ప్రేమ ఇక వర్ణించలేనిదే అనుకోండి . అయితే మీకు వంట వడటం చేతకాదు? చింతించాల్సిన పనిలేదు అందుకేగా మేమున్నది...

ఈ రోజు ఒక సింపుల్ సౌత్రన్ చికెన్ రిసిపిని మీకు పరిచయం చేస్తున్నాము. ఈ సింపుల్ అండ్ స్పెషల్ డిష్ ను ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా మీరు ప్రయత్నించవచ్చు. ఈ రిసిపి తయారుచేయడం చాలా సులభం మరియు చాలా తక్కువ టైమ్ లో రుచిగా వండపెట్టవచ్చు. మరియు ఈ సింపుల్ రిసిపికి చాలా తక్కువ మసాలా దినుసులు ఉపయోగించి రెడీ చేయవచ్చు. అయితే ఇందులో ఉపయోగించే కరివేపాకు మంచి ఆరోమా వాసన ఇస్తుంది . మరి ఈ ఇండియన్ ఫ్లేవర్ సౌత్రన్ చికెన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దం...

Simple Southern Chicken Recipe For Father's Day

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 4 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
పచ్చిమిర్చి: 3 రుచికి సరిపడా
పసుపు పొడి: 2tsp
కారం: 1tsp
గరం మసాలా పొడి: 1tsp
ఆవాలు: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
ఎండు మిర్చి: 2
కరివేపాకు: 8ఆకులు
నూనె: 3tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి, చికెన్ ముక్కలకు గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలను ఒక బౌల్లో వేసి వాటి మీద ఉప్పు, ఒక టీస్పూన్ పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. దాని తర్వాత ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, కరివేపాకు, మరియు ఎండు మిర్చి వేసి రెండు మూడు సెకండ్లు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
5. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా వేసి 5-10నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసి పెట్టుకోవాలి.
6. తర్వత అందులో పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, గరం మాసాలా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. మొత్తం మిశ్రమం బాగా వేగిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్ళు పోసి, మూత పెట్టి 10 నిముషాలు ఉడికించుకోవాలి.
8. తర్వాత మూత తీసి మరికొన్ని నీటిని జోడించి, చికెన్ ను నిదానంగా కలియబెడుతూ ఉడికించుకోవాలి.
9. ఇలా కలియబెడుతూ మరో 15నిముషాలు ఉడికించుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికేవరకూ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
10. ఒకసారి ఉడికిన స్టౌవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే సింపుల్ సౌత్రన్ చికెన్ రిసిపి రెడీ

English summary

Simple Southern Chicken Recipe For Father's Day

One of the best ways to pamper your dad on this Father's Day is to prepare something really delicious for him. Don't know how to cook well? Don't worry, we are here to help you out on that part.
Story first published: Friday, June 13, 2014, 18:49 [IST]
Desktop Bottom Promotion