For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మటన్ కర్రీ: సింధి స్టైల్

|

మటన్ కుర్మా ఒక అద్భుతమైన రుచి కలిగిన నాన్ వెజ్ డిష్. దీన్ని కర్రీ, గ్రేవీ, కుర్మా, సైడ్ డిష్ గాను తయారుచేసుకుంటారు . మటన్ రిసిపిలను వివిధ రకాలు తయారుచేయాడనికి వివిధ పద్దతులను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మన ఇండియల్ ఏ రాష్ట్రం వారికైన అత్యంత ఇష్టమైన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ మటన్ మరియు చికెన్ తో తయారుచేసిన వంటలే. సింధి స్టైల్ మటన్ కర్రీ ఫేవరెట్ మీల్ డిష్. ఈ నాన్ వెజిటేరియన్ రిసిపికి ఉల్లిపాయలు మరియు టమోటలను ఉపయోగించి తయారుచేస్తారు.

సింధులు మటన్ మటన్ మరియు ఫిష్ వంటలను ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకే వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు. ఈ సింధి స్టైల్ మటన్ కర్రీకి పెరుగు మరియు పుదీనా ఆకులను ఉపయోగించి తయారుచేసుకుంటారు. మంచి ఫ్లేవర్ తో పాటు మంచి రుచి కూడా ఉంటుంది. సింధి స్టైల్ మటన్ రిసిపి మీరు చాలా సులభంగా ప్రయత్నం చేయవచ్చు. ఇది చాలా సింపుల్ గా మరియు కారంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం...

Sindhi Style Mutton Curry

కావల్సిన పదార్థాలు:

మటన్: 500gms
ఉల్లిపాయలు: 4(సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
టమోటాలు: 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1tbsp
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
పసుపు పొడి: ½ tsp
కారం పొడి: 1tsp
నూనె: 2tbsp
నీళ్ళు: 1cup
గరం మసాలా పొడి: 1tsp
పెరుగు: 2tbsp
పుదీనా ఆకులు: 1tsp(సన్నగా తరిగినవి)
కొత్తిమీర తరుగు : కొద్దిగా గార్నిష్ చేయడానికి

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి మరియు టమోటోలు కూడా వేసి మరో 5నిముషాలు వేగించుకొని, స్టౌ ఆఫ్ చేసేయాలి.
4. వేగించుకొన్ని మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
5. ప్రెజర్ కుక్కర్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో ఈ పేస్ట్ ను వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. తర్వాత అందులో మటన్ ముక్కలను వేసి బాగా మిక్స్ చేయాలి.
7. ఇప్పుడు అందులో పెరుగు, పుదీనా తరుగు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాలపొడి, గరం మసాలా మరియు ఉప్పు వేసి మరో 10 నిముషాలు వేగించుకోవాలి.
8. ఇప్పుడు సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కుక్కర్ లోని ఆవిరి మొత్తం తగ్గే వరకూ ఉండి. తర్వాత మూత తీసి మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని , కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే సింధి స్టైల్ మటన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నం లేదా చపాతీలతో సర్వ్ చేయాలి.

English summary

Sindhi Style Mutton Curry


 Sindhi cuisine is mostly famous for items like sai bhaji, kadhi etc. Onions and tomatoes form the most essential ingredients in Sindhi style curries. You will not find a lot of spices in these curries, however the method of cooking is given a lot of importance in the Sindhi style recipes.
Story first published: Friday, December 26, 2014, 13:08 [IST]
Desktop Bottom Promotion