For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎగ్ నూడిల్స్ - సింగపూర్ స్టైల్

|

Singapore Style Egg Noodels
ఎగ్ నూడిల్స్ చాలా సింపుల్ రిసిపి. అయితే కొంచెం వెరైటీగా సింగపూర్ ఎగ్ నూడిల్స్ ను తింటే చాలా రుచికరంగా ఉంటుంది. సింగ్ పూర్ స్టైల్లో ఎగ్ నూడిల్స్, కి వెజిటేబుల్స్ మరియు బేక్ చేసిన గుడ్డుతో తయారు చేస్తారు. మాంసాహార ప్రియులు వెజిటేబుల్స్ కు బదలు, చికెన్ లేదా, రొయ్యలను ఉడికించి వేసుకోచ్చు.

ఇందులో సోయాసాస్, చిల్లీ సాస్ ను కలపడం వల్ల మరింత రుచిని అందిస్తాయి. ఈ సింగపూర్ ఎగ్ నూడిల్స్ ను ఏ టైమ్ లో అయినా, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కు తీసుకోవచ్చు. ఇందులో ఉపయోగించిన పాక్ చోయ్ ఆకులు బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరికెందుకు ఆలస్యం సింగపూర్ స్టైల్ ల్లో ఎగ్ నూడిల్స్ తయారు చేసేసుకోండి. కొత్త టేస్ట్ ను ఆరగించండి.

కావల్సిన పదార్థాలు:
ఎగ్ నూడిల్స్: 2cups(ఉడికించి వడకట్టాలి..పాకేట్‌పై సూచనలు పాటించాలి)
బీన్స్, క్యారెట్, గ్రీన్‌ పీస్, కార్న్: 1cup
గుడ్డు: 2
ఉల్లిపాయ: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి ముక్కలు: 1tsp
సోయా సాస్: 3tsp
చిల్లీ సాస్: 2tsp
పంచదార: 1tsp
పాలకూర: 50grms
ఉల్లికాడలు: 4
పాక్‌చోయ్ ఆకులు(pakchoy): కొద్దిగా(తరిగి పెట్టుకోవాలి)
రైస్ వెనీగర్: 1tsp
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ లో ఒక చెంచా నూనె వేసి వేడి అయ్యాక అందులో గిలకొట్టిన గుడ్డు వేసి దీనిని ఒక మందపాటి షీట్ పైన పరవాలి.
2. తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందుదోల వెల్లుల్లి పాయలు వేసి వేగించాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి మరో నిముషం వేయించాలి.
4. ఇప్పుడు అందులోనే బీన్స్, క్యారేట్, గ్రీన్‌పీస్, కార్న్ వేసి వుడికించాలి.(మాంసాహార ప్రియులు ఇక్కడ వెజిటేబుల్స్ కు బదులు, చికెన్, రొయ్యలు, వేసి ఉడికించుకోవచ్చు).
5. తర్వాత అందులోనే సోయాసాస్, వెనీగర్, చిల్లీసాస్, పంచదార కలపాలి. ఐదు నిముషాల తర్వాత అతి తక్కువ మంట మీద ఉంచి, పాలకూర, పాక్చోయ్, ఉప్పు, ఉల్లికాడలు వేసి నూడిల్స్ కలిపి
మరో ఐదు నిముషాలు ఉడికించాలి.
6. చివరగా గుడ్డును ఫ్రై చేసి ముక్కలుగా చేసి పెట్టుకొన్న వాటిని ఉడుకుతున్నా నూడిల్స్ లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే సింగపూర్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ.

English summary

Singapore Style Egg Noodels | ఓ కొత్త రుచి ఎగ్ నూడిల్స్

A tasty noodle dish flavoured with Chilli sauce, soya sauce, Garlic, onion and a touch of Curry Powder, ideal for a mid-week meal or packed up for lunch.
Story first published:Monday, January 21, 2013, 12:49 [IST]
Desktop Bottom Promotion