For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాట్ అండ్ స్పైసీ ఆంధ్రా స్పెషల్ వంటలు

|

సౌత్ స్టేట్స్ లో ఆంధ్రా వంటలకు ఒక ప్రత్యేకత ఉండి. హాట్ అండ్ స్పైసీగా ఉండటం వల్ల ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కువగా ఆంధ్ర వంటలను ఇష్టపడుతుంటారు. మొత్తం ఆంధ్రా వంటల్లో ప్రత్యేమైన మసాలా దినుసులతో తయారుచేస్తారు . అలాగే వంటల్లో ప్రత్యేకంగా ఎండు మిర్చి మరియు పచ్చిమిర్చిని కూడా ఉపయోగిస్తుంటారు.

సాధారణంగా కర్ణాటక, కేళర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రా వంటలకు ఎక్కువగా కొబ్బరిని ఉపయోగించరు. అవసరం అయితే ఎండుకొబ్బరి ఎక్కువగా వాడుతుంటారు. ఇండియన్ పర్సియన్ స్టైల్లో ఈ వంటలు ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా నిజాం వంటలకు ప్రత్యేక స్థానం కూడా వుంది. మొఘలాయ్ వంటలంటే ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇష్టపుడుతారు. ముఖ్యంగా ముఘలాయ్ లు పరిచయం చేసి హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడేవారు మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఇతర సౌత్ ఇండియన్ వంటలతో పోల్చితే ఆంధ్రా వంటలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి.
ఆంధ్రా కుషన్స్ లో హైదరాబాదీ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ డిష్. చాలా రుచికరంగా ఉంటుంది. వీటితో పాటు పాలక్ పప్పు, రసం, పచ్చళ్ళు వేటకవే ప్రత్యేక రుచులను కలిగి నోరూరిస్తుంటాయి. మరి మీ కూడా ఆంధ్రా స్పెషల్ వంటలను రుచి చూడాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయండి. ఎంజాయ్ చేయండి...

<a href=మటన్ పెప్పర్ ఫ్రై: ఆంధ్రా స్పెషల్ రిసిపి" title="మటన్ పెప్పర్ ఫ్రై: ఆంధ్రా స్పెషల్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

మటన్ పెప్పర్ ఫ్రై: ఆంధ్రా స్పెషల్ రిసిపి

ఇండియన్ హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తినకుండా ఉండలేరు. ముఖ్యంగా స్పైసీగా ఉండే నాన్ వెజ్ ఫుడ్ ను తినకుండా ఏ మాత్రం రాజీ పడరు. నాన్ వెజిటేరియన్స్, చికెన్, మటన్ కు, ఫిష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేడి వాతావరణం, సమ్మర్ లో కొంత మంది చికెన్ కు దూరంగా ఉంటారు.అటువంటి వారు మటన్ వంటల మీద ఎక్కువ ఇష్టపడుతారు. అయితే మటన్ ను చాలా తక్కువ వెరైటీలు కలిగి ఉంటాయి.

<a href=ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం.." title="ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం.." class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై రుచి అమోఘం..

చేపలంటే చాలా మంది ఇష్టం. చేపలను తినడం వల్ల ఆరోగ్యమే కాదు, అందం కూడా. నునుపైన చర్మ సౌందర్యం మీ సొంత అవుతుంది. తీరప్రాంతాల్లో నివసించే వారిని గమనించినట్లైతే వారి చర్మ మిళమిళ మెరుస్తుంటుంది. చేపల్లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఫిష్ వెరైటీ వంటకాల్లో ఆంధ్రా ఫిష్ కూడా ఒకటి. ఆంధ్రా ఫిష్ టేస్ట్ సూపర్బ్ గా ఉంటుంది. ఈ ఆంధ్రా స్టైల్ ఫిష్ వంటకాన్ని వండటానికి ఎక్కువ మసాలాలు అవసరం లేదు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించి, తక్కువ సమయంలో సులభంగా చేసుకొనే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ

<a href=నోరూరిరంచే మటన్ ఇగురు: ఆంధ్రా స్పెషల్" title="నోరూరిరంచే మటన్ ఇగురు: ఆంధ్రా స్పెషల్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

నోరూరిరంచే మటన్ ఇగురు: ఆంధ్రా స్పెషల్

మన ఇండియాలో మటన్ కర్రీని వివిధ రకాలుగా వండుతారు. కొన్ని మటన్ వంటలను ప్రత్యేకమైనటువంటి మసాలా దినుసులు ఉపయోగించి తయారుచేస్తారు. సౌత్ ఇండియన్ వంటల్లో ఎక్కువగా మసాలా దినుసులలతో పాటు కొబ్బరి కూడా ఉపయోగిస్తారు. అయితే మటన్ ఇగురుకు చాలా తక్కువ మసాలా దినుసులు ఉపయోగించి, చిక్కగా అటు ఫ్రై, ఇటు, పులుసు కాకుండా మీడియంగా చపాతీ,దోసె, రైస్ వంటి వాటికి తినేవిధంగా తయారుచేస్తారు.

<a href=టమోటో పప్పు: ఆంధ్ర స్టైల్ దాల్ రిసిపి" title="టమోటో పప్పు: ఆంధ్ర స్టైల్ దాల్ రిసిపి" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

టమోటో పప్పు: ఆంధ్ర స్టైల్ దాల్ రిసిపి

టమోటో పప్పు లేదా దాల్ అని నార్త్ స్టేట్స్ లో విరివిగా పిలుస్తారు. ఆంధ్రకుషన్స్ లో చాలా ఫేమస్ అయినటువంటి వంట. ముఖ్యంగా వేజిటేరియన్ స్పెషల్. వెజిటేరియన్ భోజన ప్రియుల ప్రతి రోజూ వారి భోజనంలో పప్పులేనిది ముద్దదిగదు. ఇది రుచికరమైన ఒక నార్మల్ దాల్ రిసిపి. ముఖ్యంగా ఇది స్పెషల్ సౌత్ ఇండియన్ దాల్ రిసిపి

<a href=ఆంధ్ర స్టైల్ చికెన్ 65" title="ఆంధ్ర స్టైల్ చికెన్ 65" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్ర స్టైల్ చికెన్ 65

చికెన్ 65 చాలా ఫేమస్ స్నాక్. ఈ చికెన్ రిసిపిలకు వివిధ రకాల పేర్లు ఉంటాయి. చికెన్ 65 పేరు వెనుక పెద్ద కథ ఉంది. చికెన్ 65 వంటకాన్ని పరిచయం చేసిది 1965లో చెన్నైలో ఒక పెద్ద రెస్టారెంట్. అనుకోకుండా ఈ వంటకం పేరు మెనులో 65సార్లు కనబడింది అప్పటి నుండి దీనికి చికెన్ 65 అని పేరు .

<a href=పెసరట్టు దోస రిసిపి:ఆంధ్రా స్టైల్ ట్రేడిషనల్ బ్రేక్ ఫాస్ట్" title="పెసరట్టు దోస రిసిపి:ఆంధ్రా స్టైల్ ట్రేడిషనల్ బ్రేక్ ఫాస్ట్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

పెసరట్టు దోస రిసిపి:ఆంధ్రా స్టైల్ ట్రేడిషనల్ బ్రేక్ ఫాస్ట్

మీరు ఈ రోజు ఉదయం ఒక ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తినాలనుకుంటున్నారా,మరి అయితే మీకోసం ఒక అద్భుతమైన రుచిగల బ్రేక్ ఫాస్ట్ రిసిపిని అందిస్తున్నాం. పెసరట్టు మీకు బాగా తెలుసు. ఆంధ్రస్టైల్ పెసరట్టు అంటే అందరికీ చాలా ఇష్టం. వేడి వేడి పెసరట్టును కొంచెం స్టైల్ మార్చి దోసెలా తయారుచేస్తే ఎలా ఉంటుందో, ఈ పెసరట్టు దోస తెలుపుతుంది. అందుకు ముడిపెసళ్ళుతో పాటు, పచ్చిబియ్యం కూడా కొద్దిగా నానబెట్టి, తయారుచేసే ఈ పెసరట్టుదోసె కొబ్బరి చట్నీతో మీ టేస్ట్ బడ్స్ కు అద్భుతమైన రుచి అంధిస్తుంది.

<a href=ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్" title="ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్

మాంసాహార రుచుల్ని ఎన్ని రకాలుగా వండినా అన్నిరకాల్లోనూ ఏదో ఒక డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అందులోనే ఆంధ్ర వంటకాలంటే రుచితో పాటు కొంచెం ఘాటు కూడా ఉంటుంది. కారంగా ఉండే వంటలు తయారు చేయడం అన్నా, తినడం అన్నా ఆంధ్రావారి స్పెషల్ అని చెప్పొచ్చు. కాబట్టి మామూలుగా చేసుకొనే పులావ్ ను కొంచెం ఆంధ్రా స్టైల్లో చికెన్ కలిపి పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందులో కోకోనట్ మిల్క్ కలపడం వల్ల కొంచెం స్వీట్ గా కారంగా తయారయ్యే ఈ వెరైటీ చికెన్ పులావ్ మీరు తయారు చేసి టేస్ట్ చూడండి...

<a href=ఆంధ్ర స్టైల్ రొయ్యల ఇగురు" title="ఆంధ్ర స్టైల్ రొయ్యల ఇగురు" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్ర స్టైల్ రొయ్యల ఇగురు

వంటకాల్లో రొయ్య రాజసమే వేరు. టేస్టులో ‘నేనే ద బెస్ట్' అంటూ మీసం తిప్పి మరీ చెప్పేందుకే రొయ్యకు మీసాలుంటాయి. ప్లేట్‌లో నెలవంకలా మెలితిరిగి ఉండేదే రొయ్య. రొయ్యను తినాలంటే మీసాలు తిరగక్కర్లేదు. గిన్నెలో గరిటా, వండేవారి చెయ్యీ తిరిగితే చాలు. అలా చెయ్యితిరిగేలా చెయ్యడానికే మీకోసం డిషెస్. ప్రాణం లేచివచ్చేలా ప్రాన్స్‌ను ఆస్వాదిద్దాం...

<a href=నాటుకోడి పులుసు -స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ" title="నాటుకోడి పులుసు -స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

నాటుకోడి పులుసు -స్పైసీ ఆంధ్రా చికెన్ కర్రీ

నాటుకోడి అంటే సాధారణంగా విలేజ్ సైడ్ దొరుకుతాయి. ఈ నాటుకోడితో చేసే వంటలు ఏవైనా సరే చాలా రుచిగా, నోరూరిస్తుంటాయి. ఈ ఆంధ్రా స్టైల్ చికెన్ రిసిపిని కొన్నిస్పైసీ మసాలా దినుసులు ఉపయోగించి తయారుచేస్తారు. ఈ చికెన్ రిపిసిని సండే స్పెషల్ గా లేదా ఈవెనింగ్ స్పెషల్ గా తయారుచేసుకుంటే బాగుంటుంది.

<a href=ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ" title="ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ

ఆంధ్రా స్టైల్ మష్రూమ్ కర్రీ. ఇది సౌత్ ఇండియన్ స్పెషల్ మష్రుమ్ మసాలా కర్రీ. ఈ కర్రీ స్పైసీగా మరియు స్వీట్ ఫ్లేవర్ తో నూరూరిస్తుంటుంది. ఈ వంటకు ఇంతట ఫ్లేవర్ రుచి రావడానికి కారణం ఇందులో కొన్ని రకాల ఫ్లేవర్డ్ మసాలాలు మరియు జీడిపప్పు, గసగసాలు ఉపయోగించడమే.

<a href=మసాలా గారెలు:" title="మసాలా గారెలు:" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

మసాలా గారెలు:

గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. తెలుగువారి ప్రతి పండుగకు ఈ వంటకము తప్పనిసరి. దీనిని కొబ్బరి పచ్చడి తో గాని, వేరుశనగ పప్పు పచ్చడి తో గాని, అల్లం పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. మరి ఈ వంటకాన్ని ఉగాది స్పెషల్ గా చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది.

<a href=హైదరాబాది మటన్ బిర్యానీ:" title="హైదరాబాది మటన్ బిర్యానీ:" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

హైదరాబాది మటన్ బిర్యానీ:

సాధారణంగా బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన డిష్. బిర్యానీలో కూడా వివిధ రకాలుగా తయారు చేస్తారు. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, మటన్ బిర్యానీ. రుచిలో వేటికవే అద్భుత రుచి, ఒక్కో వంటకాన్నీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మటన్ బిర్యానీ చేయాలంటే వివిధ రకాల మసాల దినుసులు అవసరం అవుతాయి.

<a href=ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర" title="ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర

తెలుగువారి వంటలలో గోగూర పచ్చడి, ఆవకాయ లాగానే గుత్తి వంకాయకు, కొంత ప్రాముఖ్యత ఉంది. అల్లం గరం మసాల ముద్దతో చేసిన గుత్తి వంకాయ కూర రైస్ కి, చపాతీలకు చాలా రుచిగా ఉంటుంది.

<a href=ఆంధ్రా స్టైల్ స్పైసీ ఖీమా ఫ్రై" title="ఆంధ్రా స్టైల్ స్పైసీ ఖీమా ఫ్రై" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

ఆంధ్రా స్టైల్ స్పైసీ ఖీమా ఫ్రై

ఖీమా ఫ్రై, డ్రై సైడ్ డిష్. వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు. కాబట్టి ఆంధ్రా స్టైల్లో ఖీమా ఫ్రై ఎలా తయారు చేస్తారో ఇక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రాస్టైల్ వంటలకు కొంచెం ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కారంగా ఉంటాయి. ఎక్కువ మసాలాలు దట్టించడంతో ఆ స్పైసీ రుచులు అద్భుతమైన టేస్ట్ తో, ఘుభాళిస్తుంటాయి. ఈ ఖీమా ఫ్రై ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మెంతి ఆకులను చేర్చడంతో మరో అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది.

<a href=హాట్ అండ్ స్పైసీ ఆంధ్రస్టైల్ మటన్ కర్రీ" title="హాట్ అండ్ స్పైసీ ఆంధ్రస్టైల్ మటన్ కర్రీ" class="sliderImg image_listical" width="600" height="338" loading="lazy"/>

హాట్ అండ్ స్పైసీ ఆంధ్రస్టైల్ మటన్ కర్రీ

సాధారణంగా ఆంధ్రా వంటలంటే చాలా స్పైసీగా ఉంటాయి. స్పైసీ లేకుండా ఆంధ్రావంటలు ఉండవంటే అతిశయోక్తికాదేమో..ఆ వంటకాల్లో ఈ మటన్ కర్రీ కూడా ఒకటి. ఈ మటన్ కర్రీలో వివిధ రకాల మసాలా దినుసులు అందులోనూ వివిధ ఫ్లేవర్స్ ఉన్న మసాల దినుసులు ఉపయోగించడం వల్ల ఈ మటన్ కర్రీ మరింత స్పైసీగా ఘుమఘుమలాడుతూ స్పైసీగా ఉంటుంది. ఈ మటన్ కర్రీ తయారు చేసే ముందుగానే మటన్ ను కుక్కర్ లో ఉడికించుకోవాలి. అప్పుడు గ్రేవీ చిక్కగా తయారవుతుంది.

English summary

Spicy Andhra Recipes From The South

Andhra recipes are known for one quality over and above everything else; they are extremely spicy. The entire Andhra cuisine comprises of a base of very rich spices. Both dry red chillies and green chillies are used amply in Andhra recipes. Unlike most other South-Indian recipes, Andhra recipes do not use excessive amount of coconut.
Desktop Bottom Promotion