For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ బంజార మటన్ కర్రీ

|

బంజార మటన్ కర్రీ. ఈ వంటను హైదరాబాదీ స్టైల్లో తయారుచేస్తారు. మసాలా లేకుండా మొత్తం పొడులతోనే తయారుచేసే ఈ బంజార మటన్ కర్రీ మంచి ఫ్లేవర్ తో పాటు రుచికరంగా ఉంటుంది..

ఈ బంజారా మటన్ కర్రీ రిసిపి చాలా సింపుల్ గా, సులభంగా తయారుచేసుకోవచ్చు . ఈ బంజార మటన్ కర్రీని మేక మాంసంతో తయారుచేస్తారు. ఈ టేస్టీ బంజార మటన్ కర్రీ రోటి, చపాతీ మరియు రైస్ కు బెస్ట్ కాంబినేషన్. మరి ఈ బంజార మటన్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Spicy Banjara Mutton Curry

కావల్సిన పదార్థాలు:
మటన్ : 500grms
టమోటాలు : 150grms
ఉల్లిపాయలు : 50grms
యాలకులు: 2
లవంగాలు: 4
దాల్చిన చెక్క: చిన్న ముక్క
నూనె : 50grms
గరంమసాలా : 2grms
పచ్చిమిర్చి : 4
అల్లం : చిన్న ముక్క
ధనియాల : 2tsp
ఎండుమిర్చి : 3
ఎండుమెంతికూర : 1tsp
ఉప్పు : రుచికి తగినంత

తయారు చేయువిధానం :
1. ముందుగా మటన్ ని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి కొంచెం ఉప్పు, గరం మసాలా కలిపి మెత్తగా ఉడికించాలి.
2. ఒక గిన్నె లో నూనె పోసి కగాక సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కల్ని ఎర్రగా వేయించండి.
3. తరువాత పచ్చిమిర్చి, అల్లం ముక్కులు వేసి కొద్ది సేపు ఫ్రై చేయండి, తరువాత దంచిన ధనియాలు, ఎండుమిర్చి కలిపి, ఉడికించిన మాంసాన్ని కూడా వేయండి.
4. ఈ మిశ్రమంలో టమోటా ముక్కల్ని వేసి సన్నని మంట మీద గ్రేవీ పూర్తిగా ఉడికే వరకూ వుంచి ఉప్పు సరి చూడండి, ఇప్పుడు దానిమీద మెంతికూర జల్లితే బంజార మటన్ రెడీ.

English summary

Spicy Banjara Mutton Curry

Banjara literally translates to Gypsy. Gosht Banjara is cooking goat gypsy style where the spices are not ground into a smooth powder but pounded coarsely using a pestle.
Story first published: Wednesday, June 4, 2014, 18:09 [IST]
Desktop Bottom Promotion