For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రిసిపి(వీడియో)

|

సీజన్ తో సంబంధం లేకుండా మన ఇండియన్స్ హాట్ అండ్ స్పైసీ చికెన్ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. బయట ఎంత ఎండలున్నా, వేడిఉన్నా స్పైసీ చికెన్ తినాలనే కోరిక ఎప్పుడూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి . చికెన్ ఫ్రైని ఎప్పుడూ వివిధ రకాలుగా తయారుచేస్తుంటారు.

ఈ స్పైసీ అండ్ క్రిస్పీ చికెన్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కానీ, దీన్ని తయారుచేసుకొనే పద్దతి తెలిస్తే మరింత టేస్టీగా తినవచ్చు. మీకోసం ఇక్కడ ఒక తయారుచేసే పద్దతిని అందిస్తున్నాము. మీరు మరింత అర్థవంతంగా సులభంగా తెలుసుకోవడానికి క్రింది వీడియోను కూడా ఇవ్వడం జరిగింది. ఈ హోం మేడ్ చికెన్ ఫ్రై తయారుచేయడం ఎలాగో ఈ క్రింది వీడియో ద్వారా తెలుసుకోండి....

Spicy Chicken Fry Recipe With Video

కావల్సిన పదార్థాల:
పెరుగు: 1cup
కార్న్ ఫ్లోర్ (మైదాపిండి): 5tsp
కారం: 1tsp
పసుపు: 3/4tsp
పెప్పర్ పౌడర్: 3/4tsp
గుడ్డు 1
నిమ్మకాయ రసం: 2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tsp
ఉప్పు: రుచికి
నూనె: 2 cups

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను మంచినీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత నీరు పూర్తిగా వంపేసి అందులో మొక్కజొన్న పిండి, కారం, పసుపు, మిరియాల పొడి, మరియు నిమ్మరసం, పెరుగు వేయాలి.
3. అలాగే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా జోడించాలి.
4. చివరగా ఒక గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండింటి బాగా గిలకొట్టి, తర్వాత చికెన్ లో పోయాలి.
5. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి. చికెన్ ముక్కలకు బాగా అంటుకొనే వరకూ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం నీళ్ళగా అనిపిస్తే అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకోవచ్చు.
6. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ మిశ్రమాన్ని 1-2గంటల పాటు అలాగే పక్కనుంచుకోవాలి.
7. 2 గంటల తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి కాగిన తర్వాత అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ లో క్రిస్పీగా మారే వరకూ ఫ్రై చేసుకోవాలి.
9. అంతే చికెన్ ఫ్రై రెడీ. ఈ స్పైసీ చికెన్ ఫ్రైని ఉల్లిపాయలు మరియు లెమన్ స్లైస్ తో సర్వ్ చేయాలి.

<center><iframe width="100%" height="417" src="//www.youtube.com/embed/N4uyUXP8QTs" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary

Spicy Chicken Fry Recipe With Video

Indians are known for eating hot and spicy food irrespective of the season. No matter how hot it is outside, the thought of biting into spicy chicken fry always tempts us. Chicken fry recipe is usually not very easy to understand. You can get 10 different versions of a spicy chicken fry recipe. It is thus natural for an amateur cook to get confused.
Story first published: Wednesday, April 23, 2014, 18:01 [IST]
Desktop Bottom Promotion