For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ చికెన్ కరాహీ : టేస్టీ అండ్ హెల్తీ

|

చికెన్ కరాహీ వయస్సుతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ చిన్న, పెద్ద అందరూ ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ వంటను అన్ని సీజన్లలోనూ తయారుచేసుకోవచ్చు . ఈ వంటను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఒక మంచి ఫ్లేవర్ కలిగిన చికెన్ కరాహీ మీరు కూడా ప్రయత్నించవచ్చు . ఇది రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే.

ఈ రుచికరమైన చికెన్ కరాహీని నాన్ లేదా రోటీ, రైతా, సలాడ్స్ మరియు చల్లగా ఉండే డ్రింక్స్ తో పాటు తీసుకోవచ్చు . ఈవంటను చాలా తక్కువ సమయంలో వండుకోవచ్చు. అంతే కాదు, ఈ చికెన్ కరాహీని తయారుచేయడానికి అవసరం అయ్యే పదార్థాలు మన వంటగదిలో నిత్యం ఉపయోగించే, అతి సులభంగా అందుబాటులో ఉండే పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. మరి ఈ స్పెషల్ చికెన్ కరాహీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Chicken Karahi: Tasty and Healthy

కావల్సిన పదార్థాలు:
చికెన్ : 1/2kg(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
టమోటోలు: 3 (రఫ్ గా పేస్ట్ చేసుకోవాలి)
అల్లం: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ 2tbsp
పచ్చిమిర్చి: 4-5
కొత్తిమీర : 1కట్ట
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి : 1tsp
కారం: 1tbsp
పసుపు: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1/4cup

తయారుచేయు విధానం :
1. ముందుగా పాన్ తీసుకొని, అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ొక నిముషం ఫ్రై చేసుకోవాలి.
2. తర్వాత అందులో ధనియాలపొడి, జీలకర్ర పొడి వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
3. ఇప్పుడు అందులోనే చికెన్ ముక్కలను కూడా వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. చికెన్ ఫ్రై అయిన తర్వాత అందులో తాజా కొత్తిమీర తరుగు మరియు పచ్చిమర్చి వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న టమోటో, ఉప్పు, మరియు కారం మరియు పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.
6. పదార్థాలన్నింటిని వేసుకొన్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. నీరు మొత్తం ఇమిరిపోయే వరకూ ఉడికించి తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
7. చివరగా తాజా కొత్తిమీర తరుగు మరియు పచ్చిమిర్చి మరియు అల్లంతో గార్నిష్ చేసుకోవాలి. అంతే రుచికరమైన చికెన్ కరాహీ రెడీ.

English summary

Spicy Chicken Karahi: Tasty and Healthy

Chicken Karahi is equally liked by all age groups and in all seasons. It is cooked at all home by all house wives but to get a superb flavour of chicken Karahi, you must try this recipe. It’s very easy to cook but very healthy and taste rich to eat.
Story first published: Friday, January 23, 2015, 12:47 [IST]
Desktop Bottom Promotion