For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసి చికెన్ వింగ్స్ : వీకెండ్ స్పెషల్

|

సాధారణంగా చికెన్ తో తయారుచేసే వంటలంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చికెన్ తో తయారుచేసే వెరైటీ డిష్ లంటే మరింత ఇష్టంగా తింటారు. ఈ మద్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి ఫేమస్ ఫుడ్ లో చికెన్ వింగ్స్ ఒకటి. ఇలాంటి డిష్ తయారుచేయడానికి కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు అవసరం అవుతాయి. ఈ చికెన్ వింగ్స్ కు సాస్ ఖచ్చితంగా అవసరం అవుతుంది.

చికెన్ కు మసాలాలు అంతగా పట్టకపోయినా స్పైసీ సాస్ లో చికెన్ వింగ్స్ ను చాలా టేస్టీగా తినేయవచ్చు. చికెన్ వింగ్స్ స్టాస్టర్స్ గా సర్వ్ చేస్తారు. మీరు మీ ఇంట్లో ఎవరినైనా గెస్ట్ గా ఎక్స్ పెక్ట్ చేస్తుంటే కనుక ఇలాంటి చికెన్ వింగ్ డిష్ వెరైటీగా ఒక కొత్త టేస్ట్ ను వారికి అందివ్వవచ్చు. మరి ఈ స్పైసీ చికెన్ వింగ్స్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Chicken Wings Starter Recipe

కావల్సిన పదార్థాలు
చికెన్ వింగ్స్ : 1/2kg
ఉప్పు: రుచికి సరిపడా
సోయా సాస: 1tbsp
ఉల్లిపాయ: 1tsp(సన్నగా తరిగినవి)
ఓరిగానో: 1tbsp
నిమ్మరసం: 1tsp
పెప్పర్: 2tbsp
మైదా: మ్యారినేషన్ కోసం
నూనె: 2tbsp

సాప్ కోసం :
స్ప్రింగ్ ఆనియన్: 2(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
వెనిగర్: 1tsp
బ్రౌన్ షుగర్: 2tbsp
టమోటో కెచప్: 2tbsp
చిల్లీ సాస్: 2tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఉప్పు, సోయా సాస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఓరిగానో, బ్లాక్ పెప్పర్, నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని స్పూన్ తో బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వింగ్స్ ను వేసి బాగా మిక్స్ చేసి, మసాలా బాగా పట్టే విధంగా కోట్ చేయాలి.
2. ఇప్పుడు చికెన్ మీద కొద్దిగా మైదా చిలకరించి 5 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ ను ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యే వరకూ వేగించుకోవాలి
4. అంతలోపు సాస్ కోసం సిద్దంగా ఉంచుకొన్న పదార్థాలన్నింటి ఒక బౌల్లో వేసి సాస్ ను రెడీ చేసుకోవాలి.
5. సాస్ రెడీ అయినా తర్వాత ఈ సాస్ ను ముందుగా ఫ్రై చేసి ఉంచుకొన్న చికెన్ వింగ్స్ కు కోటింగ్ లా వేయాలి.
6. సాస్ లో చికెన్ వింగ్స్ కోట్ చేసిన తర్వాత మైక్రోవోవెన్ లో పెట్టి 5నిముషాలు హీట్ చేసుకోవాలి. అంతే స్పైసీ చికెన్ వింగ్స్ రెడీ

Story first published: Saturday, March 21, 2015, 14:20 [IST]
Desktop Bottom Promotion