For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ దాల్ గోష్ట్ - స్పెషల్ మటన్ రిసిపి

|

మీరుమాంసాహారాల ప్రియులైతే అందులోనూ మటన్ ఎక్కువగా ఇష్టపడే వారైతే, మీరు వివిధ రకాల మటన్ రిసిపిలను తినవచ్చు. ఈ మటన్ కర్రీ స్పెషాలిటీ ఏంటేంటే దాల్. వివిధ రకాల పప్పులు మటన్ తో చేర్చి తయారుచేస్తారు. అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యం కూడా...

ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ గా ఉండే ఈరెండింటికాంబినేషన్ రిసిపిని ఎలా తయారుచేయాలో ఒక సారి చూద్దాం...

Spicy Dal Gosht Recipe

కావల్సిన పదార్థాలు:
చనా పప్పు: ½cup
ఉద్దిపప్పు: ½cup
మటన్: 500gms(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 3 (సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటా 1(సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
కొత్తిమీర: 1/4cu (సన్నగా తరిగిపెట్టుకోవాలి
మింట్ ఆకులు: 2tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ధనియాల పొడి: 1tbsp
పసుపు: 1tsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 2tsp
పచ్చిమిరపకాయలు: 2 (మద్యకు కట్ చేయాలి)
నల్ల మిరియాలు పొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా పొడి: 1tsp
నీళ్ళు: 4 cups

తయారుచేయు విధానం:
1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.,
2. తర్వా ప్రెజర్ కుక్కర్ ను నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
3. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు పాటు మీడి మంట మీద వేగించుకోవాలి.
4. ఇప్పుడు అందులో శుభ్రం చేసి పెట్టుకొన్న మటన్ ముక్కలు కూడా వేసి 5-10నిముషాల వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసి మరో 5-10నిముషాల వరకూ వేగించుకోవాలి.
6. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం , పచ్చిమిర్చి జీలకర్ర, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేస్తూ, నిదానంగా వేగించుకోవాలి.
7. తర్వాత అందులో టమోటో ముక్కలు కూడా వేసి 5-10నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
8. ఇప్పుడు అందులో శెనగపప్పు మరియు ఉద్దిపప్పు కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత వెంటనే ఉప్పు, గరం మసాలా పౌడర్ మరియు నీళ్ళు వేసి బాగా మిక్స్ చేసి ప్రెజర్ కుక్కర్ మూత్ పెట్టి తక్కువ మంట మీద 5-6విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
9. ఉడికిన తర్వతా స్టౌ ఆఫ్ చేసి, కుక్కర్ లో ఆవిరి పూర్తిగా తగ్గేవరకూ ఉండి తర్వాత మూత తీసి, సర్వింగ్ బౌల్లోనికి మార్చుకొని, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
10. ఈ స్పైసీ దాల్ గోస్ట్ రోటీ లేదా పరోటాలకు మంచి కాంబినేషన్.

English summary

Spicy Dal Gosht Recipe

If you are a mutton lover then you must have tasted many different mutton recipes till now. But this spicy dal gosht recipe is one of its kind. The specialty of this mutton curry is that it is cooked with two different types of lentils or dals. The presence of these dals add to a unique flavour to his mutton recipe which is sure to tickle your taste buds.
Story first published: Thursday, October 24, 2013, 13:45 [IST]
Desktop Bottom Promotion