For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ

|

డాబా స్టైల్ ఫుడ్ కు ఏది సాటి రాదంటుంటారు. ఎందుకంటే, ఇంట్లో తయారుచేసే, రెస్టారెంట్ ఫుడ్స్ కు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా డాబా స్టైల్ వంటల్లో తడకా, వివిధ రకాలుగా తయారుచేసే పన్నీర్ కర్రీలు మరియు వేడి వేడి రోటీలు, ఇంకా తందూరి వంటలు నోరూరిస్తుంటాయి.

మనం ఇంట్లో తయారుచేసుకోగల డాబా స్టైల్ రిసిపిలు వివిధ రకాలుగా ఉన్నాయి. డాబా స్టైల్లో తయారుచేసే వంటలు రుచి మరియు ఆరోమా వాసన వల్లే ఈ డాబా స్టైల్ ఫుడ్ కు మన ఇండియాలో ఎక్కువ ఫేమస్. మరి స్పైసీ ఫుడ్ లో ఒకటైన డాబా స్టైల్ ఎగ్ కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Dhaba Style Egg Curry Recipe

కావల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు: 4 (ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
అల్లంవెల్లుల్లి పేస్ట్ :1tbsp
పచ్చిమిర్చి: 2 (మద్యకు కట్ చేయాలి)
పసుపు: 2tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర పొడి: 1tsp
డ్రై మ్యాంగో పౌడర్: 1tsp
గరం మసాల: 1/2 tsp
ఉప్పు: రుచికి సరిపడా
బ్లాక్ పెప్పర్ పౌడర్: 1 1/2 tsp
జీలకర్ర: 1tsp
దాల్చిన చెక్క: 1
యాలకలు: 2
బిర్యానీ ఆకు: 1
నూనె: 4tbsp

Spicy Dhaba Style Egg Curry Recipe

తయారుచేయు విధానం:
1. ముందుగా ఫ్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకొన్న గుడ్డు అలాగే వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.

Spicy Dhaba Style Egg Curry Recipe
2. ఫ్రై చేసుకొన్న తర్వాత వాటిని పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలకలు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేగనివ్వాలి.
4. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

Spicy Dhaba Style Egg Curry Recipe
5. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. తర్వాత అందులో పచ్చిమిర్చి, బ్లాక్ పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర, మరియు ఉప్పు కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

Spicy Dhaba Style Egg Curry Recipe
7. తర్వాత మీకు అవసరం అయినంత నీటిని అందులో వేసి, మిక్స్ చేస్తూ, డ్రై మ్యాంగ్ పౌడర్ మరియు గరం మసాలను వేసి ఉడికించుకోవాలి.
8. ఇప్పుడు అందులో ముందుగా నూనెలో ఫ్రై చేసి పెట్టుకొన్న గుడ్డు మరియు ఒక కప్పు నీళ్ళు పోసి సిమ్ లో పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ...
Spicy Dhaba Style Egg Curry Recipe
Spicy Dhaba Style Egg Curry Recipe

Spicy Dhaba Style Egg Curry Recipe

Spicy Dhaba Style Egg Curry Recipe

English summary

Spicy Dhaba Style Egg Curry Recipe

Nothing matches the taste of the dhaba food. The spicy dal tadka, varieties of paneer curries and the hot rotis straight from the tandoor are simply mouthwatering.
Story first published: Tuesday, January 20, 2015, 12:28 [IST]
Desktop Bottom Promotion