For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ ఎగ్ కోకోనట్ మసాలా రిసిపి

|

ఎగ్ వంకాల్లో వివిధ వెరైటీలున్నాయి. ఎటువంటి మీల్ కైనా అద్భుతంగా నప్పుతాయి. గుడ్లను ఉడికించడం లేదా పగులగొట్టి చేయడం కంటే..గుడ్లను ఉడికించి యాడ్ చేయడా ఓ మంచి అద్భుతమైన సైడ్ డిష్. ఎగ్ మసాలా, ఎగ్ బుర్జి, ఎగ్ కర్రీ వంటి ఎగ్ రిసిపిలు చాలా పాపులర్ రిసిపిలు. ఈ సడై డిష్ రిసిపిను వైట్ రైస్ లేదా రోటీలకు మంచి కాంబినేషన్ . ఎగ్ మసాలా విత్ కోకనట్ తో ఎప్పుడైన ట్రై చేసారా?సాదారణంగా ఎగ్ కోకనట్ మసాలా, అందరికీ తెలిసినది. ఈ ఎగ్ కోకోనట్ మసాలా ను కొన్ని మసాలా దినుసులతోనూ మరియు కోకోనట్ తో నూ తయారు చేస్తారు . కోకనట్ ను చాలా వరకూ సౌత్ ఇండియన్ డిష్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి కోకనట్ ఎగ్ సాలాను ఎలా తయారు చేస్తారో చూడండి.

Spicy Egg Coconut Masala Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4 (ఉడికించి ఔటర్ షెల్ తీసి పక్కన పెట్టుకోవాలి)
కోకోనట్ పేస్ట్: ½ cup
ఉల్లిపాయ: 1 (పేస్ట్ తయారు చేసుకోవాలి)
టమోటో: 1 (పేస్ట్ లా తయారు చేసుకోవాలి)
వెల్లుల్లి: 4-5 (mashed)
పచ్చిమిర్చి: 3
ధనియాల పొడి: 1tsp
కారం: 1tsp
పసుపు: ½ tsp
ఆవాలు: ½ tsp
జీలకర్ర: ½ tsp
చెక్క: 1 inch
యాలకలు: 1
బిర్యాని ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత

తయారు చేయు విధానం:
1. ముందు ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో బిర్యాని ఆకు, లవంగాలు, చెక్క, ఆవాలు, జీలకర్ర వేసి వేగించుకోవాలి.
2. సీడ్స్ చిటపటలాడాకా, అందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకూ వేగించుకోవాలి.
3. ఇప్పుడు అందులోనే వెల్లల్లి తరుగు, పచ్చిమిర్చి, పసుపు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
4. తర్వాత అందులోనే టమోటో పేస్ట్ కూడా వేసి మరో ఐదు నిముషాలు వేగించాలి. ఇప్పడు అందులో ధనియాల పొడి, కారం, కోకోనట్ సేప్ట్ వేసి బాగా మిక్స్ చేసి పది నిముషాల పాటు తక్కువ మంట మీద వేగంచాలి .
5. అంతలోపు ఉడికించిన గుడ్లను రెండుగా కట్ చేసుకోవాలి. వీటిని వేగుతున్న మసాలాలో యాడ్ చేసుకోవాలి. అంతే చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.ఎగ్ కోకోనట్ మసాలా రెడీ...

English summary

Spicy Egg Coconut Masala Recipe | స్పైసీ ఎగ్ కోకోనట్ మసాలా రిసిపి

There are many egg recipes that you can try for any meal of the day. Apart from boiling or scrambling the eggs, you can even add them to prepare some delicious side dishes. Egg masala, egg bhurji and egg curry are few of the most popular egg recipes for the main course. These side dishes are served with rice as well as rotis. Have you tried egg masala with coconut? chopped coriander leaves and serve egg coconut masala hot.
Story first published: Tuesday, March 26, 2013, 11:56 [IST]
Desktop Bottom Promotion