గుమగుమలాడే జింజర్‌ ఫిష్‌

Spicy Ginger Fish Aid0069
కావలసిన పదార్థాలు:
చేపముక్కలు: 500grms
ఉల్లిపాయలు: 4
అల్లం: 100grms
వెల్లుల్లిపాయ: 1
కారం: 2tsp
మిరియాలపొడి: 1/2tsp
సోయాసాస్‌: 4tsp
నిమ్మరసం: 2tsp
వెనిగర్: 1tbsp
అజనొమాటో: 1/2tsp
రెడ్‌ ఆరెంజ్‌ కలర్‌: చిటికెడు
ఉప్పు: రుచికి తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
కొత్తిమిరతరుగు: 2tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ముక్కల్ని మెత్తగా గ్రైండ్‌ చేయాలి. అల్లం వెల్లుల్లి కూడా మెత్తగా నూరాలి.
2. తర్వాత చేపముక్కలు శుభ్రంగా కడిగి ఉప్పు, కారం అద్ది కొద్దిగా నూనె వేస్తూ పాన్‌ లో రెండువైపులా వేయించి ఉంచాలి.
3. ఇప్పుడు ఓ వెడల్పాటి పాన్ లో నూనె వేసి కాగాక ఉల్లిముద్దను దోరగా వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి కూడా వేసి నూనె తేలేవరకూ వేయించాలి.
4. ఉప్పు, కారం, మిరియాలపొడి, సోయాసాస్‌, అజనొమాటో, ఆరెంజ్‌ కలర్‌ కూడా వేసి మరి కాసేపు వేయించాలి. 5. ఇప్పుడు దోరగా వేయించిన జింజర్ చేపముక్కలు వేసి ముక్క విరగకుండా వేయించి తీయాలి. అంతే జింజర్ ఫిష్ ను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.
Posted by:
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .