For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ రిసిపి

|

భారతదేశం అంతటా చికెన్ కర్రీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని సార్లు మనం చేర్చే మసాలా పదార్థాలు మరియు తయారుచేసే విధానం ఇలా డిఫరెంట్ టేస్ట్ ను అంధిస్తుంటాయి. అందుకు మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ ఉదాహరణ.

ఈ స్పైసీ మహారాష్ట్ర చికెన్ కర్రీ కొన్ని వినూత్న మసాలా దినుసులను ఉపయోగించి తయారు చేయబడింది. ఈ స్పెషల్ మహారాష్ట్ర చికెన్ తయారు చేయడానికి ఈ ప్రాంతంలో goda మసాలాను ప్రత్యేకంగా తయారు చేసుకుంటారు. goda మసాలాతో తయారు చేసే చికెన్ కర్రీ మంచి రుచిని మరియు మంచి ఫ్లేవర్ ను అంధిస్తాయి. ఈ మరాఠీ స్పెషల్ టేస్ట్ ను మీరు చూడాలనుకుంటే స్పైసీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీను మీరు ట్రై చేయండి...

కావల్సిన పదార్థాలు:
చికెన్: 500grms
ఉల్లిపాయ : 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2tbsp
టమోటాలు: 2
కారం: 1tsp
పసుపు: 1tsp
గరం మసాలా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
Goda మసాలా: 3tbsp
నూనె: 2tbsp
నీరు: 1cup

Goda మసాలా కోసం:
ఎండు కొబ్బరి: 1(తురుము)
ఉల్లిపాయ : 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం: కొద్దిగా
వెల్లుల్లి: 6-8రెబ్బలు
తాజా కొత్తిమీర: 1tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
నూనె: 2tsp
ఉప్పు : చిటికెడు
గరం మసాలా పొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రం చేసి, కడిగి పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్లో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పౌడర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి అందులో చికెన్ ముక్కలు కూడా వేసి మిక్స్ చేసి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత godaమసాలను తయారు చేసుకోవడం కోసం పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి,అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
5. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి, కొబ్బరి తురుము వేసి ఒక నిముషం పాటు వేగించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
6. వేగించుకొన్న పదార్థాలు చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి కొత్తిమీర తరుగు, గరం మసాలా పౌడర్ మరియు ఉప్పు వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
7. అరగంట తర్వాత, పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు వేసి 5నిముషాలు, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
8. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మీడియం మంట మీద మరో రెండు నిముషాలు వేగించుకోవాలి.
9. తర్వత అందులో పసుపు, కారం, గరం మసాలా పౌడర్ మరియు టమోటోలు వేసి, 5నిముషాలు ఉడికించుకోవాలి. టమోటో ముక్కలు మెత్తబడే వారకూ వేగించుకోవాలి.
10. ఇప్పుడు అందులోనే goda మసాలాను కూడా వేసి ఒక నిముషం వేగించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
11. చికెన్ ముక్కలను ఒక ఐదు నిముషాలు వేగించిన తర్వాత అందులో ఉప్పు, సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టి 20నిముషాల పాటు మీడియం మంట మీదు పూర్తిగా ఉడికించుకోవాలి.
12. మద్య మద్యలో కలియబెడుతుండాలి. ఒకసారిగా చికెన్ ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే స్పైసీ అండ్ డెలిషియస్ మహరాష్ట్రియన్ చికెన్ కర్రీని అన్నం మరియు చపాతీలతో సర్వ్ చేయవచ్చు.

English summary

Spicy Maharashtra Chicken Curry Recipe | స్పైసీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ రిసిపి

Chicken curries all over india differ in some way or the other. Sometimes the blend of spices makes the difference while sometimes the procedure of cooking. Maharashtra chicken curry is one such example of the exotic chicken curries of India.
Desktop Bottom Promotion