For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబార్ ఫిష్ కర్రీ: స్పైసీ కేరళ వంటకం

|

ఫిష్‌తో చేసిన ఐటమ్స్ తినడానికేం...? చేప ఈదినంత వీజీగా రెండు చేతులా ఎడాపెడా ఆరగించవచ్చు. కాకపోతే కాస్త ముల్లూ గిల్లూ చూసుకోవాలంతే.
ఫిష్ కర్రీ తయారు చేయడం చాలా సులభం. అది మలబార్ తీరంలో వండే ఫిష్ కర్రీలు, ఫ్రైలు చాలా వెరైటీ రుచులకు పర్యాటకులను అలరిస్తుంటుంది. అక్కడికి వెళ్ళ పర్యాటకుల ఇలాంటి రుచులును చాలా ఇష్టంగా తింటుంటారు. కేరళ స్పెషల్ కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో తయారు చేసి వారి స్టైల్ ఫిష్ వెరైటీలు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీకి సౌత్ ఇండియన్ స్పైసీతో మ్యారినేట్ చేసి , ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతం. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అటువంటి రుచిని మనం ఇట్లో తయారు చేసుకొనొ మలబార్ రుచులను ఆస్వాదిద్దాం..

Spicy Malabar Fish Curry-Kerala Style Recipe

ఫిష్: (సాల్మన్ లేదా ఇతర మీకు ఇష్టమైన చేపలు): 1kg(మీకు కావల్సిన సైజ్ లో కట్ చేసుకోవాలి)
చింత గుజ్జు: 1cup
మెంతులు: 1tsp
కరివేపాకు రెబ్బలు: 4-5
ఉల్లిపాయలు: : 2-3(సన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 5(సన్నగా కట్ చేసినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tbsp
టమోటో గుజ్జు: 1 cup
కారం: 1-2tsp
ధనియాల పొడిం 1 ½ tsp
పసుపు: 1- 1 ½ tsp
కొబ్బరి పొడి: 1-2 cups
కొబ్బరిపాలు: 1-2 cups
వెజిటేబుల్/కొబ్బరి నూనె: ½ cup

తయారు చేయు విధానం:
1. ముందుగా చేపముక్కలను శుభ్రం చేసి ఉప్పు, చింత గుజ్జుతో మ్యారినేట్ చేయాలి.
2. తర్వాత కొబ్బరి తురుమును తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రంగు మారగానే స్టౌ ఆఫ్ చేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు డీప్ బాటమ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో వెజిటేబుల్ లేదా కొబ్బరి నూనె వేసి కాగనివ్వాలి. తర్వాత అందులో మెంతులు, కరివేపాకు రెబ్బలు వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ మారగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించాలి.
4. తర్వాత అందులోనే టమోటో గుజ్జు, వేసి మరికొంత సేపు ఫ్రై చేయాలి. తర్వాత కారం, ధనియాలపొడి, పసుపు, కొబ్బరి పొడి చల్లి మరో 5-10నిముషాల పాటు వేయించుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను కూడా వేసి వేయించాలి.
5. ఇప్పుడు కొబ్బరి పాలను పోసి మరో ఐదునిముషాల పాటు ఉడికించాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు. ఈ మిశ్రమాన్నంతటి కొద్ది సేపు ఉడికించి స్టౌ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే మలబార్ ఫిఫ్ కర్రీ రెడీ..

English summary

Spicy Malabar Fish Curry-Kerala Style Recipe | స్పైసీ మలబార్ ఫిష్ కర్రీ

Malabar fish curry is one of the most popular fish recipes of Kerala. The spicy texture of this fish curry is simply wonderful. In fact Malabar fish is one of the tastiest of all the coastal cuisines. For all the fish lovers this is an ideal recipe. You will get all the coastal flavours in this cuisine. You can make Malabar fish curry with shell, salmon or any other fish that you love to eat. It is better if you do not use fish fillets for this recipe.
Story first published: Wednesday, January 30, 2013, 12:58 [IST]
Desktop Bottom Promotion