For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మస్టర్డ్ చికెన్ రిసిపి-స్పెషల్ ప్లేవర్&టేస్ట్

|

మీరు ఒకరకమైన చికెన్ వంటలు తిని బోర్ గా ఫీలవుతున్నారా?అయితే మీరు ఒక ప్రత్యేకమైన వంటను రుచిచూడాల్సిందే. మీకోసం ఇక్కడ ఒక కొత్త వంటకాన్ని పరిచయం చేస్తున్నాం. అదే మస్టర్డ్ చికెన్ రసిపి. ఈ చికెన్ నోరూరిసి,చాలా టేస్టీగా ఉంటుంది.

చాలా వరకూ బెంగాలీ రిసిపిలు మస్టర్డ్ తో తయారుచేస్తారని వినే ఉంటారు . ముఖ్యంగా ఫిష్ రిసిపిలు. ఈ వంటకానికి కూడా మస్టర్డ్ పేస్ట్ ను ఉపయోగించడం జరిగింది. మస్టర్డ్ పేస్ట్ తో పాటు, మస్టర్డ్ ఆయిల్ ను కూడా ఉపయోగించి ఈ వంటను తయారుచేయడం వల్ల ఒక డిఫెర్ట్ ఫ్లేవర్, డిఫరెంట్ టేస్ట్ ను మీకు అంధిస్తుంది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూడండి.

Spicy Mustard Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)

మ్యారినేషన్ కోసం :
నిమ్మరసం 2tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
ఉల్లిపాయ పేస్ట్: 3tbsp
పెరుగు: ½cup
ఆవాలు ఆయిల్: 1tbsp
కారం: 1tsp
వైట్ ఆవాలు: 4tbsp
పచ్చిమిర్చి 3-4
ఉప్పు: రుచికి సరిపడా

గ్రేవీకోసం కాల్సిన పదార్థాలు:
ఆవనూనె: 4tbsp
షుగర్: 1tsp
ఉల్లిపాయలు: 3 (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పసుపు: 1tsp
కారం: 1tsp
వైట్ ఆవాలు పేస్ట్: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
వెచ్చని నీళ్ళు: 3cups

తయారుచేయు విధానం:
1. ముందుగా మస్టర్డ్ సీడ్స్ మరియు పచ్చిమర్చి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకోవాలి.
2. తర్వాత చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేసి, మస్టర్డ్, పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు, మ్యారినేషన్ కోసం లిస్ట్ లో సిద్ధంగా ఉంచుకొన్నా పదార్థాలన్నింటినీ కూడా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టించాలి.
3. మ్యారినేషన్ చేసిన ఈ చికెన్ ను రిఫ్రిజరేటర్ లో ఒక గంట పాటు పెట్టాలి.
4. ఒక గంట తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, అందులో మస్టర్డ్ ఆయిల్ వేసి, అందులో షుగర్ కూడా వేయాలి. ఇది నూనెలో పాకంలా తయారవుతుంది. అందుకు మీడియం మంట పెట్టాలి. పంచదార కరిగే వరకూ, కలర్ బ్రౌన్ కలర్ మారే వరకూ కలియబెడుతుండాలి.
5. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి 5నిముషాలు వేగించుకోవాలి .
6. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో రెండు, మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో మ్యారినేటెడ్ చికెన్ వేసి 10నిముషాలు ఫ్రై చేసుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
8. ఇప్పుడు అందులో పసుపు, కారం, రెండు టీస్పూన్ల్ వైట్ మస్టర్డ్ పేస్ట్, ఉప్పు వేసి మరో రెండు నిముసాలు వేగించుకోవాలి .
9. తర్వాత అందులో గోరువెచ్చని నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
10. తర్వాత పాన్ కు మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి.
11. కొంత సమయం తర్వాత పాన్ మూత తీసి, చికెన్ ముక్కలు మెత్తగా ఉడికిందో లేదో నిర్ధారించుకోవాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. యమ్మీ అండ్ మస్టర్డ్ చికెన్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంకు మంచి కాంబినేషన్.

English summary

Spicy Mustard Chicken Curry Recipe

Bored of the same old chicken curries? Then it's time to try something unique and delicious. Here is a completely new and unique recipe of spicy mustard chicken curry. This chicken recipe hails from the Bong kitchen where mustard makes every dish burst with some strong and lip-smacking flavours.
Story first published: Friday, November 29, 2013, 12:00 [IST]
Desktop Bottom Promotion