For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ మటన్ కాలియా రిసిపి: అవద్ టేస్ట్

|

మాంసాహార వంటల్లో వివిధ రకాలున్నాయి. అందులో ముఖ్యంగా కాశ్మీరి వంటలు మరియు హైద్రాబాదీ వంటలు మరియు రాయల్ అవాద్ వంటలు ఇలా వివిధ రకాలుగా ప్రాంతాల వారిగా వండుతుంటారు. మీకోసం ఈరోజు ఒక స్పెషల్ వంటకం అవధి మటన్ రిసిపిని పరిచయం చేస్తున్నాం.

ఈ వంట చాలా టేస్టీ గా మరియు అద్భుతంగా ఉంటుంది. మటన్ కాలియా ఎక్కు పదార్థాల యొక్క అవసరం లేకుండానే రుచికరంగా తయారుచేసుకోవచ్చు. ఫెన్నల్ మరియు కేవార్ వాటర్ ఈ రెండు మటన్ రిసిపికి ఒక మంచి ఫ్లేవర్ ను అంధిస్తాయి. మరి ఈ స్పెషల్ మటన్ కాలియా ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Mutton Kalia Recipe: The Taste Of Awadh

కావల్సిన పదార్థాలు

మటన్: 1kg
ఉల్లిపాయ పేస్ట్: 4tbsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
కారం పొడి: 1tsp
పసుపు పొడి: 1tsp
ధనియాల పొడి: 1tsp
జీలకర్ర పొడి: 1/2tsp
గరం మసాలా పొడి: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
పెరుగు: 1cup
టమోటా గుజ్జు : 1/2cup
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1
కేవరా వాటర్: 1/2tsp
బేబీ పొటాటో-3:4 (పొట్టుతీసి పెట్టుకోవాలి)
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారుచేయు విధానం

1. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు కారం బాగా మిక్స్ చేసి అందులో మాటన్ ముక్కలను కూడా వేసి 10-15నిముషాలు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి అందులో జీలకర్ర మరియు బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి.
4. ఒక నిముషం వేగిన తర్వాత అందులో మ్యారినేట్ మటన్ వేసి మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతుండాలి. వాటర్ మొత్తం ఆవిరి అయ్యే వరకూ ప్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులోనే టమోటో గుజ్జు మరియు ఉప్పు కూడా వేసి 5-6నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. తర్వాత అందులోనే ధనియాల పొడి మరియు జీలకర్రపొడి వేసి మరో 5-10నిముషాలు వేగించుకోవాలి .
7. మరో పాన్ లో రెండు టీస్పూన్ల నూనె వేసి అందులో బేబీపొటాటోలను వేసి కొద్దిగా ఉప్పు మరియు పసుపు వేసి, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
8. ఇప్పుడు ఫ్రై చేసుకొన్న బేబీ పొటోటాలను ఉడుకుతున్న మటన్ లో వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి, తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
9. ఒకసారి ఉడికిన తర్వాత మూత తీసి అందులో గరం మసాలా మరియు కెవార్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.
10. అంతే సర్వ్ చేయడానికి మటన్ కాలియా రెడీ. ఈ రాయల్ డిష్ ను పులావ్ మరియు రోటీలతో తీసుకోవచ్చు.

English summary

Spicy Mutton Kalia Recipe: The Taste Of Awadh


 There are plenty of mutton recipes in India. Be it Kashmiri recipes or Hyderabadi or the royal Awadhi, mutton can be prepared into some of the most succulent dishes with the apt culinary skills. So, today we have a royal Awadhi mutton recipe for you which tastes heavenly and is easy to make.
Story first published: Thursday, October 16, 2014, 12:19 [IST]
Desktop Bottom Promotion