For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసి పెప్పర్ క్యాప్సికమ్ చికెన్ రిసిపి

|

మధ్యాహ్నన మీల్స్ లో టేస్టీ ట్రీట్ . చాలా రుచికరంగా మరియు స్పైసీగా ఉండే పెప్పర్ క్యాప్సికమ్ చికెన్ రిసిపి . చికెన్ తయారుచేయడానికి అవసరం అయ్యే మసాలా దినుసులతో చాలా టేస్టీగా తయారుచేయవచ్చు.

బరువు తగ్గించుకోవాలనుకొనే వారు అందులోనే స్పైసీగా తినాలని కోరుకొనే వారు ఇలాంటి చికెన్ వంటలను ఎంపిక చేసుకోవాలి . చికెన్ వంటలో జోడించే క్యాప్సికమ్ క్యాలరీలను తగ్గిస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది . మరి ఈ లోక్యాలరీ చికెన్ రిసిపిని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Spicy Pepper Capsicum Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1/2kg
ఉల్లిపాయ: 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
క్యాప్సికప్: 3(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
పెరుగు: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కారం: 2tsp
గసగసలా పౌడర్: 1tsp
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బిర్యానీ ఆకు: 1
పెప్పర్ పౌడర్: 1tbsp
కొత్తిమీర: కొద్దిగా(సన్నగా తరిగి పెట్టుకోవాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి, అందులో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అల్లం, వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసి 5నిముషాలు పక్కన పెట్టుకోవాలి. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద పెట్టాలి.
2. తర్వాత ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ను కుక్కర్ లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
3. ఇప్పుడు పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన క్యాప్సికమ్ మరికొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయాలి.
4. ఇప్పుడు ముందుగా కుక్కర్ లో ఉడికించుకొన్న చికెన్ వేసి మసాలాతో ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో గసగసాల పౌడర్, పెప్పర్ పౌడర్ వేసి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. చికెన్ పూర్తిగా మసాలాలో ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర తరుగు చిలకరించి మరో నిముషం ఫ్రై చేయాలి అంతే స్పైసి పెప్పర్ క్యాప్షికమ్ చికెన్ రెడీ.

English summary

Spicy Pepper Capsicum Chicken Recipe

This afternoon we have a special treat for your tummy - spicy pepper capsicum chicken recipe. To prepare this delectable treat the main ingredient you need is chicken!
Story first published: Wednesday, March 25, 2015, 15:07 [IST]
Desktop Bottom Promotion