For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పైసీ థాయ్ చికెన్ వింగ్స్ రిసిపి

|

థాయ్ ఫుడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే మన ఇండియాలో అంత పాపులర్ అయ్యాయి. ఈ వంటలు చాలా స్పైసీగా మరియు గొప్ప రుచిని కలిగి ఉంటాయి . సాధారణంగా థాయ్ ఫుడ్స్ కు చాలా సింపుల్ వస్తువులను మరియు హెర్బ్స్ ను ఉపయోగిస్తుంటారు. అందుకు చాలా టేస్టీగా ఉంటాయి. అటువంటి టేస్ట్ ఆహారాల్లో ఈ థాయ్ చికెన్ వింగ్స్ బాసిల్ రిసిపి ఒకటి.

సైసీగా వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇటువంటి థాయ్ రిసిపిలు ఉత్తమ ఎంపిక. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వాళ్లకు రంగులు మాత్రమే కాదు. రుచికరమైన కూరలు. రుచి మాత్రమే కాదు. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న కూరలు. ఈ తరహావంటలకు థాయ్‌లాండ్ ప్రసిద్ధివీటిని చేయటానికి పెద్ద శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ల కూరల్లో వెజ్, నాన్‌వెజ్ రెండూ ఉన్నాయి. అలాంటి స్పెషన్ నాన్ వెజ్ చికెన్ చికెన్ వింగ్స్ ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము. మరి వీటిని ఎలా తయారుచేయాలో తెలుసుకుని , వంటకు రెడీ అయిపోవడమే....

Spicy Thai Chicken Wings Recipe

కావల్సిన పదార్థాలు:

చికెన్ వింగ్స్ - 250 g
జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ - 1 teaspoon
ఆలివ్ ఆయిల్ - 1 teaspoon
ఫిష్ ఆయిల్ - 1 teaspoon
సోయా సాస్ - 2 teaspoons
చిల్లీ సాస్ - 2 teaspoons
చిల్లీఫ్లేక్స్ - 1 teaspoon
లెమన్ జ్యూస్ - 1 teaspoon
ఉప్పు: రుచికి సరిపడా
పామ్ షుగర్
నూనె

తయారుచేయు విధానం:
1. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్, సాల్ట్, పామ్ షుగర్, ఆలివ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, సోయా సాస్, చిల్లీ సాస్, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసి, మొత్తం పదార్థాలను మిక్స్ చేసుకోవాలి.

2. ఇప్పుడు చికెన్ వింగ్స్ తీసుకొని నీట్ గా వాటర్లో శుభ్రంగా కడిగి పక్కన తీసి పెట్టుకొని పూర్తిగా నీరు డ్రై అవ్వనివ్వాలి.

3. నీరు పూర్తిగా వంపేసిన తర్వాత చికెన్ వింగ్స్ ను ముందుగా మసాలాలు కలిపి పెట్టుకొన్న పెద్ద బౌల్లోనికి చికెన్ వింగ్స్ కూడా వేయాలి.

4. ఈ మసాలా దినుసులన్నీ చికెన్ వింగ్స్ కు పూర్తిగా పట్టేలా చేయాలి .

5. ఇలా మసాలాలతో మిక్స్ చేసి పెట్టుకొన్న చికెన్ వింగ్స్ ను 3 నుండి 4గంటల సేపు రిఫ్రిజరేటర్లో పెట్టాలి.

6. 4 గంటల తర్వాత బయటకు తీసి పెట్టి, పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక, చికెన్ వింగ్స్ మీద కొద్దిగా కార్న్ ఫ్లోర్ చల్లి ఒక్కొక్కటే కాగే నూనెలో వేసి డీఫ్ ఫ్రై చేసుకోవాలి.

7. చికెన్ వింగ్స్ నూనెలో బాగా ఫ్రై అయి, బ్రౌన్ కలర్లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అంతే థాయ్ స్టైల్ చికెన్ వింగ్స్ రెడీ. మీకు నచ్చిన సాస్ తో సర్వ్ చేయడమే ఆలస్యం.

English summary

Spicy Thai Chicken Wings Recipe

Want to taste something hot and spicy tonight? Well, if you love chicken, here is one of the best reasons to take another bite of it. So what are we preparing? Get ready to taste the hot and spicy chicken wings recipe. This is the best recipe that you can try today!
Story first published:Tuesday, March 1, 2016, 17:10 [IST]
Desktop Bottom Promotion