For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న ఉల్లిపాయలతో ఎగ్ ఆమ్లెట్ : స్పెషల్ సైడ్ డిష్

|

ఆమ్లెట్ అనేది ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్, మీల్ సైడ్ డిష్ మరియు హెల్తీ ఈవెనింగ్ స్నాక్ రిసిపి కూడా. ఆమ్లెట్ ను ఏ సమయంలో అయినా తినవచ్చు. కొన్ని రకాల ఆమ్లెట్స్ ను చాలా టేస్టీగా మరియు సులభంగా తయారుచేసుకోవచ్చు.

ఆమ్లెట్ ను వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు. ప్లెయిన్ ఆమ్లెట్ కు కొద్దిగా ఉప్పు మరియు పెప్పర్ పౌడర్ చల్లనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ కు కొన్ని వెజిటేబుల్ ముక్కలు మరియు చీజ్ జోడించుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చిన్న ఉల్లిపాయలు లేదా ఉల్లికాడల తరుగుతో ఆమ్లెట్ ప్రయత్నించారా? లేదంటే ఈరోజు స్పెషల్ సైడ్ డిష్ గా మీరు స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ ఆమ్లెట్ రిసిపిని ట్రై చేయండి. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Spring Onion Omelette: Special Side Dish


కావలసిన పదార్థాలు:

గుడ్లు - 2
పచ్చిమిర్చి: 4(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పెప్పర్ పౌడర్: 1/4tsp
పాలు - 1tbsp
ఉల్లి కాడల తరుగు - 1cup
ఉప్పు - రుచికి తగినంత
నూనె - తగినంత

తయారుచేసే విధానం:
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్లు చిదిమి, పాలు, ఉప్పు కలిపి బాగా గిలకొట్టాలి. ః
2. తర్వాత అందులోనే ఉల్లికాడల తరుగు (గ్రీన్‌ + వైట్‌) మరియు పచ్చిమిర్చి తరుగు వేసి మరోసారి బాగా కలపాలి.
3. తర్వాత స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆమ్లెట్‌ వేసి, సన్నని మంటపై (మాడకుండా) రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. చివరగా కొద్దిగా పెప్పర్ పౌడర్ చిలకరించి ఒక నిముషం తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి.

English summary

Spring Onion Omelette: Special Side Dish

Spring Onion with Egg white Omelette, Telugu Vantalu, Many people have to give on omelets in their 40s because they have high cholesterol. But then omelet recipes are a favourite with everyone. So, how do we make omelet recipes healthy? There is a very simple way...
Story first published: Tuesday, October 6, 2015, 12:32 [IST]
Desktop Bottom Promotion