For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుచికరమైన మంగోలియన్ చికెన్ రిసిపి స్పైసీ అండ్ టేస్టీ

|

చైనా ఫుడ్ ను ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటున్నారా?మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్ అండ్ స్పైసీ మంగోలియన్ చికెన్ రిసిపిని ఇంట్లో తప్పక ట్రై చేయండి. మంగోలియన్ చికెన్ రిసిపి ఫర్ ఫెక్ట్ ఏసియన్ రిసిపి. ఎందుకంటే ఇది ఫర్ ఫెక్ట్ రుచి కారం, తీపి, మరియు పుల్లగా ఉంటుంది కాబట్టి. ఈ రిసిపిని ఒరిజినల్ గా బీఫ్ తో తయారు చేస్తారు. కానీ ఇక్కడ చికెన్ ఉపయోగించి చికెన్ లవర్స్ కోసం ఓ కొత్త వంటకాన్ని మీకు అందిస్తున్నాం.

మంగోలియన్ చికెన్ తయారు చేయడం అంత కష్టమైన పనేం కాదు. ఈ చికెన్ రిసిపి అంతా సాస్ తోనే తయారు కాబడుతుంది. ఈ సాస్ లను ఈ డిష్ కు చేర్చడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు రుచిగా కూడా ఉంటుంది. చికెన్ ను ముందుగా నూనెలో ఫ్రై చేసి తర్వాత సాస్ తో ఫ్రై చేయడం వల్ల ఇది చాలా క్రిస్పిగా ఉంటుంది. మరి ఈ మంగోలియన్ చికెన్ రిసిపి ఎలా తయారు చేయాలో చూద్దాం..

Stir-fry Mongolian Chicken
చికెన్ : 500 gms(ఎముకలు లేని మెత్తని చికెన్)
కార్న్ స్ట్రాచ్: ½cup(పూత కోసం)
వెల్లుల్లి: 1tbsp(చిన్న ముక్కలుగా తరిగినవి)
ఉల్లిపాయ : 1 (ముక్కలుగా చేసుకోవాలి)
స్ప్రింగ్ ఉల్లిపాయలు: 2 కొమ్మలు(చిన్న ముక్కలుగా తరిగినవి)
నల్ల మిరియాలు పొడి: 1tsp
హొయిసిన్ (Hoisin)సాస్: 2tbsp
సోయా సాస్: 2tbsp
ఒయిస్టర్ సాస్: 1tbsp
ఎండు మిర్చి : 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: 1tsp
నూనె: 1tbsp (స్టైర్: వేయించడానికి)
నూనె: 2cups(డీప్ ఫ్రై చేయడానికి)
నీళ్ళు: 1 cup

తయారు చేయు విధానం:
1. ముందుగా చికెన్ స్ట్రిప్స్ ను శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వత కార్న్ స్ట్రాచ్ ను ప్లేట్ మీద స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కడిగి పెట్టుకొన్న చికెన్ స్ట్రిప్స్ ను స్ట్రాచ్ మీద వేయడం వల్ల కార్న్ స్టాచ్ పూర్తిగా అంటుంది.
3. ఇప్పుడు డీప్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో నూనె వేసి కాగిన తర్వాత , చికెన్ ముక్కలు అందలో వేసి తక్కువ మంట మీద డీఫ్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సోయాసాస్, ఒస్ట్రెస్ సాస్, హొయిసిన్ సాస్, రెడ్ చిల్లీ, పంచదార వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత స్టౌ మీద పాన్ అందులో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, దోరగా వేగే వరకూ తక్కువ మంట మీద వేగించుకోవాలి .
6. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న వెల్లుల్లి, స్పింగ్ ఆనియల్స్ వేసి మరో రెండు మూడు నిముషాలు వేగించుకోవాలి.
7. అందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
8. ఇప్పుడు అందులో మిక్స్ చేసి పెట్టుకొన్న సాస్ మిశ్రమాన్ని అందులో పోసి మరో 5నిముషాలు ఉడికించుకోవాలి.
9. ఉడుకుతున్న సాస్ చిక్కబడేటప్పుడు, ఫ్రై చేసుకొన్న చికెన్ అందులో వేసి బాగా మిక్స్ చేయాలి.
10. అంతే ఇలా చికెన్, సాస్ రెండూ బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. అంతే స్టైర్ ఫ్రై మంగోలియన్ చికెన్ రెడీ. ఇది అన్నం మరియు నూడిల్స్ కు ఫర్ ఫెక్ట్ కాంబినేషన్.

English summary

Stir-fry Mongolian Chicken Recipe

Planning to cook Chinese food at home? Then the sweet and spicy Mongolian chicken recipe is a must-try. Mongolian chicken recipe is a perfect Asian dish which is sweet, sour and spicy at the same time. This recipe is originally prepared with beef.
Story first published: Wednesday, June 5, 2013, 17:06 [IST]
Desktop Bottom Promotion