For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబి స్టైల్లో గుడ్డు మసాలా కూర

|

మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు లేదా మీరు కాలేజ్ లేదా ఆఫీస్ నుండి ఆలస్యంగా ఇంటికి వెళ్ళినప్పుడు మీకు వంట చేయాలనిపించదు, అప్పుడు వెంటనే త్వరగా తయారయ్యే సులభంగా ఇంట్లో నిల్వ ఉండే గుడ్డు మీద మనస్సు పడుతుంది. కొత్తప్రయోగం చేయాలన్నా, చాలా త్వరగా చేయాలన్నా అందుకు చక్కటి ఎంపిక గుడ్లు. గుడ్లను ఉడికించి అలాగే తినవచ్చు లేదా కర్రీ తయారుచేసి తినవచ్చు . ఎలాఅయినా తయారుచేయవచ్చు. ఈ ఇష్టమైన కర్రీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడమే కాదు, ఆరోగ్యం కూడా.

ఈ రోజు మీకోసం ఒక రుచికరమైన ఎగ్ కర్రీ, అదీ ఇతర రాష్ట్ర శైలిలో తయారుచేసే విధానాన్ని పరిచయం చేస్తున్నాం. మనం చేసే వంటలకంటే కొంచెం భిన్నంగా తయారుచేయడం వల్ల ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈ నోరూరించే, ఆరోగ్యకరమైన గుడ్డు కర్రీని ఎలా తయారుచేయాలో చూద్దాం...

Sumptuous Punjabi Anda Masala Recipe

కావల్సిన పదార్థాలు:
గుడ్లు: 4(ఉడకించి, పొట్టు తీసి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు: 1(సన్నగా కట్ చేసుకోవాలి)
జీలకర్ర: 1tsp
బిర్యానీ ఆకు: 1tsp
టమోటో గుజ్జు: 1tbsp
కారం:1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1/2tsp
డ్రై మ్యాంగో పొడి: 1tsp
మెంతిఆకులు: 1tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
గరం మసాలా: 1/2tsp
నూనె: 2tమsp
నీళ్ళు: 1cup

మసాలా ముద్ద కోసం :
ఉల్లిపాయలు: 2
పచ్చిమిర్చి : 2
అల్లం: చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 5
లవంగాలు: 2
చెక్క: 1
సోంపు: 1tsp
టమోటోలు: 2

తయారుచేయు విధానం:
1. ముందుగా మసాలా కొరకు సిద్దంగా ఉంచుకొన్న పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, డ్రై మ్యాంగో పౌడర్, టమోటో గు్జు, వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను కూడా అందులో వేసి మరో 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
5. మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకూ వేగిస్తూనే అందులో ఉప్పు, గరం మసాలాపొడి వేసి మరో రెండు, మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అందులో నీళ్ళు పోసి కొద్దిసేపు ఉడికిన తర్వాత, ఉడికించి పెట్టుకొన్న గుడ్లు కూడా వేసి తర్వాత బాగా మిక్స్ చేయాలి.
8. మంట మీడియంగా పెట్టి, గ్రేవీ కొద్దిగా చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
9. తర్వాత మెంతి ఆకులను సన్నగా కట్ చేసి, గ్రేవీలో వేసి మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి, రెండు మూడు నిముషాల ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన పంజాబి స్టైల్లో గుడ్డు మసాలా కూర రెడీ. ఈ గ్రేవీ జీర రైస్ లేదా పరాటాలకు చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Sumptuous Punjabi Anda Masala Recipe

When you are alone at home or reach home late and don't feel like cooking, egg comes to your rescue. It is one of the easiest ingredient to cook and experiment with. It can eaten all by itself or can be prepared with spicy curries. However you cook eggs, they just taste delicious.
Story first published: Monday, December 16, 2013, 17:50 [IST]
Desktop Bottom Promotion