
కావలసిన పదార్థాలు:
పచ్చిరొయ్యలు(ప్రాన్స్): 1/2kg
ఉల్లిపాయ పేస్ట్: 1cup
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2cup
అజినమోటో: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
మిరియాల పొడి: 1tsp
కారం: 2tsp
తేనె: 1tsp
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
టొమాటో సాస్: 1tbsp
సోయా సాస్: 1tsp
ఫుడ్ కలర్: చిటికెడు
కొత్తిమీర తరుగు: 1/2cup
తయారు చేయు విధానం:
1. ముందుగా ప్రాన్స్‌ని శుభ్రం చేసి వేడినీటిలో కాస్త ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
2. పాన్ లో అరకప్పు నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
3. తర్వాత గ్లాస్ నీరు పోసి ఉడికించాలి. మిశ్రమం దగ్గర పడేటప్పుడు, తేనె, టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇందులో ఉడికించిన రొయ్యలను కలిపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. దోరగా వేయించిన జింజర్ ప్రాన్స్ ను సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించాలి. ఇది వెజిటేబుల్ రైస్..వైట్ రైస్ కి మంచి కాంబినేషన్....













