For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాంగీ మ్యాంగో చికెన్ కర్రీ: సమ్మర్ స్పెషల్

|

వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసిన మామిడి పండ్ల ఘుమఘములే. ఈ రుచికరమైన పండ్లను తినడానికి ప్రతి ఒక్కరూ సంవత్సరం అంతా వేచిఉంటారు. మామిడి పండ్లు, పండువైనా, పచ్చివైనా సరే తినడానికి చాలా మంది ఇష్టపడుతారు. ముఖంగా ఆవకాయ పెడుతుంటారు. దీన్ని సంవత్సరం పొడవును ఆవకాయతో ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఈ మామిడి పండ్లను కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటుంటారు.

పచ్చిమామిడి కాయ సువాసన ఎప్పుడూ నోరూరిస్తుంటుంది. మంచి ఫ్లేవర్ తో పాటు కాస్తఒగరుపులుపుతో నోరూరిస్తుంటాయి. వేసవి సీజన్ లో పచ్చిమామిడికాయను ఉపయోగించి వివిధ రకాల వంటలు కూడా వండుతారు. అందులో ఒకటి మ్యాంగో చికెన్. మ్యాంగో చికెన్ తయారుచేయడం చాలా సులభం. దీన్ని మ్యాంగో పేస్ట్ తో తయారుచేస్తారు. మరి మీరు కూడా టేస్ట్ చూడాలంటే, ఈ మ్యాంగో చికెన్ ఎలా తయారుచేయాలో చూడండి...

 Tangy Mango Chicken Curry Recipe

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 1kg(మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మ్యారినేషన్ కోసం:
నిమ్మరసం: 2tbsp
పెరుగు: 2tbsp
పండని మామిడి -1 (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 5-6
పచ్చిమిర్చి : 2
ఉప్పు: రుచికి సరిపడా
కర్రీ కోసం:
ఉల్లిపాయలు: 3 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు:4
పండని మామిడి -1 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
పచ్చిమిర్చి: 2
పసుపు: 1tsp
కారం: ½ tsp
జీలకర్ర: 1tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర: 1tsp
పంచదార: ½ tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 4tbsp
కొత్తిమీర - 2tbsp (తరిగినది)

తయారుచేయు విధానం:
మ్యారినేషన్ :
1. ముందుగా మామిడికా ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
2. తర్వాత ఈ పేస్ట్ కు నిమ్మరసం, పెరుగు, ఉప్పు చేర్చి ను బోన్ లెస్ చికెన్ ముక్కలకు పట్టించి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
కర్రీ కోసం:
1. ముందుగా మామిడి కాయ ముక్కలను, పచ్చిమిర్చి, వెల్లుల్లిని మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్ లా తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి
3.. అరగంట తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనెను ఫ్రైయింగ్ పాన్ లో వేసి వేడి చేయాలి, వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4.మీడియం మంట మీద చికెన్ ముక్కలు బ్రౌన్ కరల్ వచ్చే వరకూ వేగించుకోవాలి. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి.
5. మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాయ అందులో జీలకర్ర వేసి ఒక నిముషం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో 5-6నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
6. కొద్దిసేపటి తర్వాత అందులో ముందుగా తయారుచేసుకొన్న మ్యాంగో పేస్ట్, పసుపు, జీలకర్రపొడి, ధనియాల పొడి కారం, షుగర్ వేసి మరో 5-6నిముషాలు మీడియం మంట మీద వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకొన్ని చికెన్ ముక్కలను, కొద్దిగా ఉప్పు వేసి, కొద్దిగా నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి.
8. మిక్స్ చేసిన తర్వాత పాన్ కు మూత పెట్టి 20నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి
9. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత మూత తీసి చూసి, స్టౌ ఆఫ్ చేయాలి.
10. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. అంతే ట్యాంగీ అండ్ స్పైసీ మ్యాంగో చికెన్ కర్రీ రెడీ. ఈ రుచికరమైన చికెన్ రిసిపిని రైస్ లేదా పరోటాలతో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి.

English summary

Tangy Mango Chicken Curry Recipe

The mango season is here. People wait for summer only to get a taste of this delightful fruit. Mangoes are enjoyed in all their forms. Whether they are ripe or unripe, people love to indulge in this 'King Of Fruits'.
Story first published: Thursday, April 24, 2014, 18:14 [IST]
Desktop Bottom Promotion