For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ చీజ్ చికెన్ బర్గర్ రిసిపి

|

ఇంటికి చేరుకోవడం లేటైపోయింది, ఏదైనా త్వరగా తయారుచేసుకోవాలి. టేస్ట్ గా ఉండాలి. వెరైటీగా తినాలని కోరుకొనే వారికి ఒక స్పెషల్ డిష్ బర్గర్. కాలేజి పిల్లల నుండి, ఆఫీస్ కు వెళ్ళే వారి వరకూ ఇంకా హౌస్ వైఫ్ వరకూ బర్గర్ తినడం అంటే చాలా ఇష్టం.

మరి మీరు కూడా వీరిలో ఒక్కరైతే బర్గర్స్ బయటకు ఆర్డర్ చేయకుండా , ఇంట్లోనే హెల్తీగా...బెస్ట్ టేస్ట్ తో తయారుచేసుకోండి . మరి ఇంట్లో బర్గర్ తయారుచేసుకోవడానికి ఏమేమి కావాలి ఎలా తయారుచేయాలో చూద్దాం....

Tasty Cheese Chicken Burger Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్ మిన్స్ - 100 gms
బన్నులు - 4
బ్రెడ్ పొడి - 1 cup
వెల్లుల్లి - 1/2 tbsp
టమోటో - 2
ఉల్లిపాయలు - 2
మెయోనైజ్ - 2 tbsp
బట్టర్ - 2 tbsp
సాస్ - 1 cup
చీజ్ స్లైస్ - 4
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ఖీమా మరియు బ్రెడ్ పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత అందులోనే వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఉల్లిపాయ ముక్కలు మరియు కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
3. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని నాలుగు సమాన భాగాలుగా తీసుకొని ఫ్లాట్ పాటీస్ గా ప్లేస్ చేయాలి. ఇలా సర్ధుకొన్న పాటిస్ ను పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పడు ఒక ఫ్లాట్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి . తర్వాత పాటీస్ ను అందులో సర్దుకొని, బ్రౌన్ కలర్ వచ్చే వరకూ హీట్ చేయాలి.
5. అలా రెండు వైపులా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకూ ఉడకడానికి కనీసం 15నిముషాలు పడుతుంది. రెండు వైపులా కాల్చుకోవాలి.
6. తర్వాత మెయోనైజ్ మరియు కెచప్ తీసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి.
7. ఇప్పుడు బన్ తీసుకొని రెండు బాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెండుగా కట్ చేసుకొన్న బన్స్ ను తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు ఒక పీస్ బన్ తీసుకొని దాని మీద టమోటో, ఉల్లిపాయ, మరియు చీజ్ ఒకదానికి తర్వాత ఒకటి సర్ధుకోవాలి.
9. తర్వాత వాటి మీద పాట్టీస్ ను ఉంచి మరో బ్రెడ్ ముక్కతో కవర్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి.
10. చికెన్ చీజ్ బర్గర్ రెడీ . వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

English summary

Tasty Cheese Chicken Burger Recipe

Tasty Cheese Chicken Burger Recipe. Of late, one of the most prefered dish for lunch is burger. Right from collage guys to office goers and the house wives all of them love to eat burger. So, if you love eating burger, you dont have to always order for it or go out to eat them.
Story first published: Saturday, September 12, 2015, 15:34 [IST]
Desktop Bottom Promotion