For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీజ్ చికెన్ బర్గర్: హెల్తీ అండ్ టేస్టీ హోం మేడ్ బర్గర్ రిసిపి

|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో డైట్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా యువత ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ లో బర్గర్ ఒకటి. బర్గర్ అంటే చిన్న పిల్లల దగ్గర నుండి కాలేజ్ గర్ల్స్, ఆఫీసులకు వెళ్ళే వారు, మరియు హౌజ్ వైఫ్ ల వరకూ బర్గర్ తినడానికి ఎక్కువ ఇష్టపడుతారు.

కాబట్టి, మీకు కూడా బర్గర్ తినాలి అనిపిస్తున్నదా, ఎప్పుడూ బయట ఆర్డర్ చేసి తినాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మరింత టేస్టీగా మరియు హెల్తీగా బర్గర్ ను తయారుచేసుకోవచ్చు.

మరి ఈ బర్గర్ రిసిపిని చాలా సులభంగా మరియు సింపుల్ గా ఎలా తయారుచేయాలో...అందుకు ఏమోమి అవసరం అవుతాయన్న విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.. ఫాలో అయిపోండి మరి....హెల్తీ అండ్ టేస్టీ బర్గర్ ను యమ్మీగా ఎంజాయ్ చేసేయండి....

Tasty Cheese Chicken Burger Recipe: Recipes in Telugu

కావల్సిన పదార్థాలు:
చికెన్ - 100grms
బన్ - 4
బ్రెడ్ పొడి - 1cup
వెల్లుల్లి - 1/2tbsp
టొమాటో - 2
ఉల్లిపాయ - 2
మయోన్నైస్ - 2tbsp
వెన్న - 2tbsp
సాస్ - 1cup
చీజ్ స్లైస్ - 4
ఆయిల్

తయారుచేయు విధానం:
1. ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ఖీమా మరియు బ్రెడ్ పొడి వేసి మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉప్పు, బ్లాక్ పెప్పర్, ఉల్లిపాయలు మరియు కొత్తిమీర వేసి మిక్స్ చేయాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 4 సమభాగాలుగా చేసుకొని, ప్యాటీస్(కట్ లెట్ లేదా వడలాగా) తట్టి పక్కన పెట్టుకోవాలి.
4. తర్వాత ఒక ఫ్లాట్ పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ చికెన్ కట్ లెట్స్ ను పెట్టి, రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై ఫ్రై చేసుకోవాలి.
5. 10-15 నిముషాలు బాగా ఫ్రై చేసుకొన్న తర్వాత, ప్యాటీస్ ను రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి.
6. అంతలోపు మెయోనైజ్ మరియు కెచప్ తీసుకొని రెండింటిని మిక్స్ చేసుకోవాలి.
7. తర్వాత బన్ తీసుకొని రెండు గా కట్ చేయాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా బట్టర్ వేసి, కరిగిన తర్వాత బన్ పెట్టి వేడి చేయాలి.
8. ఇప్పడు పాన్ మీద నుండి బన్ తీసుకొని దానికి మెయోనైజ్ మిశ్రమాన్ని రెండు వైపులా అప్లై చేసి, పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు ఒక బన్ తీసుకొని, దానికి మీద చక్రాల్లా కట్ చేసిన టమోటో, ఉల్లిపాయ మరియు చీజ్ స్లైస్ ను ఒకదాని తర్వాత ఒకటి అమర్చాలి.
10. ఇప్పుడు పాన్ మీద ఫ్రై చేసుకొన్న ప్యాటీని కూడా ఉంచి, తర్వాత మరో బన్ తో క్లోజ్ చేయాలి .
11. అంతే చికెన్ చీజ్ బర్గర్ రెడీ. వేడివేడిగా తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది.

English summary

Tasty Cheese Chicken Burger Recipe: Recipes in Telugu

Of late, one of the most preferred dish for lunch is burger. Right from collage guys to office goers and the house wives all of them love to eat burger.
Story first published: Tuesday, September 22, 2015, 12:32 [IST]
Desktop Bottom Promotion