For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ చికెన్ మసాలా రైస్ రిసిపి

|

సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా రైస్.

చికెన్ తో రైస్ అంటే ఫ్రైడ్ రైస్ ఎక్కువ చేస్తుంటాము. దీన్నే చైనీస్ పద్ధతిలో కాకుండా చేసుకోవచ్చు. చికెన్, ఎగ్స్ ,పుదీనా,కొత్తిమీర అన్నీ ఉండడంతో స్పైసీ ఫ్లేవర్స్ తో అందరూ చాలా ఇష్టపడతారు. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇది ఇండియన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది చూడటానికి, తినడానికి రెస్టారెంట్ వంటాల అనిపిస్తుంది కానీ రెస్టారెట్ ఐటమ్ మాత్రం కాదు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకొనే ఈ చికెన్ రైస్ రిసిపి చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....కావల్సిన పదార్థాలు:

నీళ్ళు: 6cups
చికెన్: 500grms
రైస్: 2cups
బెల్ పెప్పర్: 1(పెద్దది)
ఉల్లిపాయ: 1(మీడియం సైజ్)
పసుపు: 1tbsp
వెల్లుల్లి పౌడర్: 1tbsp
ఉప్పుమరియు పెప్పర్: రుచికి సరిపడా
పార్ల్సే: 1tbsp

Tasty Chicken Masala Rice Recipe

తయారుచేయు విధానం:

1. ముందుగా ఆరు కప్పులు నీళ్ళు పోసి, చికెన్ ముక్కలను ఉడికించుకోవాలి. ఉడికించుకొన్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. చికెన్ ఉడికించిన నీళ్ళు ఒక కప్పులో వంపేసి వేరుగా పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి, తర్వాత శుభ్రంగా కడిగి ఉంచుకొన్న బియ్య బేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. తర్వాత అందులోనే బెల్ పెప్పర్ మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత మిగిలిన మసాలా దినుసులు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత 2 కప్పులుచికెన్ ఉడికించిన నీళ్ళు, 3కప్పులు నీళ్ళు మిక్స్ చేయాలి.
4. తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసి మంటను మీడియంగా పెట్టి తక్కువ మంట మీద 20నిముషాలు ఉడికించుకోవాలి.

English summary

Tasty Chicken Masala Rice Recipe


 You do not feel like cooking much during the lazy weekends. You feel like relaxing after a hectic week of work and look for easy recipes which would get ready quickly.
Story first published: Saturday, May 3, 2014, 17:50 [IST]
Desktop Bottom Promotion