For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టేస్టీ కాశ్మీర్ చికెన్ యక్నీ

|

కాశ్మిర్ వంటలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడి వంటలు చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇండియన్ వంటలకు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ముఖ్యంగా యక్నీ వంటలను పెరుగు మరియు మటన్ బ్రోత్(ఉడికించిన నీరు)తో తయారుచేస్తారు . చికెన్ యక్నీ వంటను ప్రధానంగా పర్శియన్ వంట. ఈ స్పెషల్ వంట అక్బర్ కాలంలో మన ఇండియాలో పరిచయం చేయబడినది.

యక్నీని చికెన్, ఫిష్, మంటర్ మరియు ముష్రుమ్ వంటలకు బేస్ గా తయారుచేస్తుంటారు. అంతే కాదు, యక్నీ ఒక్క నాన్ వెజ్ కాంబినేషన్ మాత్రమేకాదు, వెజిటేరియన్ లో బంగాలదుంపలు, క్యాబేజ్ మరియు కాలీఫ్లవర్ కాంబినేషన్ గా కూడా తయారుచేస్తారు. ఈ చికెన్ యక్నీ రిసిపిని కాశ్మీరియులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎంత రుచి ఉంటుందో అంతే ఫ్లేవర్ కూడా ఉంటూ ప్రతి ఒక్కరినీ నోనూరించేలా చేస్తుంది. యక్నీ రిసిపిని వివిధ రకాలుగా తయారుచేసుకోవచ్చు. అయితే కాశ్మిర్ స్టైల్ లో చాలా సింపుల్ గా ఎలా తయారుచేయాలో చూద్దాం...

Tasty Kashmiri Chicken Yakhni Recipe

కావల్సిన పదార్థాలు:
చికెన్: 1kg
పెరుగు: 1/2ltr
సోంపు పౌడర్: 4tsp
అల్లం పొడి: 4tsp
పుదీనా ఆకులు(ఎండినవి): 4tbsp
నూనె: తగినంత
యాలకలు: 5
దాల్చిన చెక్క: 1
ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
1.డీప్ బాటమ్ పాన్ లో పెరుగు వేసి, స్టౌ మీద పెట్టి, మంటను ఎక్కువగా పెట్టాలి. తర్వాత స్పూన్ తో కలియబెడుతూ ఉడకిస్తుండాలి. పెరుగు ఉడికి చిక్కబడ్డ తర్వాత, స్టౌ మీద నుండి దింపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో చికెన్ వేసి ఫ్రై చేయాలి.
3. చికెన్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు చికెన్ ఉన్న బౌల్లో సోంపు, అల్లం, పౌడర్, దాల్చిన చెక్క, యాలకలు మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి.
5. తర్వాత అందులో 3 కప్పుల నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించుకోవాలి.
6. చికెన్ ఉడుకుతున్నప్పుడు, అందులో పెరుగు కూడా చేర్చి చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
7. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత ఎండిన పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి. అంతే కాశ్మీర్ చికెన్ యక్నీ రెడీ. ఈ టేస్టీ కాశ్మిర్ చికెన్ రిసిపి రైస్ కు ఒక చక్కటి కాంబినేషన్.

English summary

Tasty Kashmiri Chicken Yakhni Recipe

In Kashmir, yakhni recipe is essentially made of yoghurt and mutton broth. Kashmiri chicken yakhni recipe is originally a Persian dish and came to India during the reign of Akbar. Yakhni can be a base for many dishes such as chicken, fish, mutton and mushroom cuisines. Yakhni recipe can also be prepared vegetarian with vegetables such as potato, cabbage and cauliflower.
Story first published: Monday, January 26, 2015, 13:15 [IST]
Desktop Bottom Promotion