For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ - ఎగ్ పులావ్

|

అన్నివేళల్లో అందుబాటులో ఉండే ఏకైక వంటసరుకు కోడిగుడ్డు. సమయానికి కూరలు లేకపోయినా, కూరగాయలు కొండెక్కి కూర్చున్నా(ఈ మధ్య ఇది తరచుగా జరుగుతోంది) సరదాగా నాన్‌వెజ్ తినాలన్నా ఆ లోటుని తీర్చే శక్తి ఒక్క కోడిగుడ్డుకే ఉంది.

'రోజూ ఒక గుడ్డు తింటే ఆరోగ్యం మీ సొంతం' అని మన పెద్దల నుంచి నేటి పరిశోధకుల వరకూ అందరూ చెబుతూనే ఉన్నారు. అందుకే గుడ్డుతో చేసుకునే రొటీన్ వంటలన్నీ కాసేపు పక్కన పెట్టి కొత్త వెరైటీ ఎగ్ పులావ్ చూడండి.

vegetable egg pulav

కావలసిన పదార్థాలు:
కోడి గుడ్లు: 8
బియ్యం: 1/2kg
మిక్స్డ్ వెజిటేబుల్స్: 1cup(క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్)
అల్లం వెల్లుల్లి ముద్ద: 2tbsp
పచ్చిమిరపకాయలు: 6-8
ఎండుమిరపకాయలు: 8
కారం: 2tbsp
పసుపు: చిటికెడు
లవంగాలు: 6
దాల్చిన చెక్కలు: 6
ఉప్పు: తగినంత,
ఉల్లిపాయ ముక్కలు: 1cup
కరివేపాకు: రెండు రెబ్బలు
కొత్తిమీర: ఒక కట్ట
గరం మసాలా: 2tbsp
నూనె: సరిపడా
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు

తయారుచేయు విధానం:

1. ముందుగా నాలుగు కోడిగుడ్లతో అట్టు వేసుకోవాలి. రెండువైపులా ఎర్రగా వేగిన అట్టుని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. మరో నాలుగు గుడ్లని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని నీరు ఒంపేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి.
2. బాగా కాగిన తర్వాత కరివేపాకు, ఒక టేబుల్ స్పూను అల్లంవెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఎర్రగా వేగిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా గరంమసాలా వేసి బాగా కలపాలి.
3. తర్వాత కోడి గుడ్డు అట్టు ముక్కలు వేసి బాగా వేయించాలి. కొద్దిగా నీళ్లు పోసి ముద్దగా అయ్యేవరకూ ఉడికించి దించేయాలి.
4. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోయాలి. బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
5. ఇవి వేగాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి గరిటతో కలపాలి. ఇందులో గరంమసాలా, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కాసేపు బియ్యాన్ని వేగించుకోవాలి.
6. ఇప్పుడు కోడిగుడ్డు ముక్కల కూర అందులో వేసి బాగా కలపాలి. ఒక లీటరు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. చివర్లో నెయ్యివేసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను ముక్కలుగా కోసి పలావుపైన అలంకరించుకోవాలి.

English summary

Vegetable and Egg pulao

vegetable egg pulav. Nupur sent me a lovely package of very fresh & fragrant Kolhapuri masala. A healthy delicious breakfast. A simple to make super recipe of Egg pulao, that your family will love.
Story first published: Thursday, April 25, 2013, 11:52 [IST]
Desktop Bottom Promotion