For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజిటేబుల్ గార్లిక్ చికెన్ రిసిపి

|

వెజిటేబుల్ గార్లిక్ చికెన్ రిసిపి మరో వెరైటీ అండ్ టేస్టీ చికెన్ రిసిపి. ఎందుకంటే ఘాటైన గార్లిక్ ఫ్లేవర్ మరియు ఎక్సోటిక్స్ స్పైసీస్(మసాలా) దినుసులతో వండర్ఫుల్ టేస్ట్ ను అందించే ఒక మెయిన్ డిష్. ఈ నాన్ వెజ్ హెల్తీ డిష్ ను మద్యహ్నా లంచ్ మరియు డిన్నర్ లో ప్రత్యేకంగా తీసుకోవచ్చు.

రుచికరకంగా మరియు నోరూరించే ఫ్లేవర్ తో ఉండే వెజిటేబుల్ గార్లిక్ వెజిటేబుల్ చికెన్ రిసిపి మరో సీక్రెట్ ఏంటంటే, ఇందులో వివిధ రకాల వెజిటేబుల్స్ ఉపయోగించడం వల్ల పూర్తి పోషకాలను, ప్రోటీనులను అందించి మన ఆరోగ్యానికి సహాయపడుతాయి. మరి ఈ స్పెషల్ వెజిటేబుల్ గార్లిక్ చికెన్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...

Vegetable Garlic Chicken Recipe

కావల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్: 500grms
క్యాప్సికమ్: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యారెట్ : 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
క్యాబేజ్: కొద్దిగా (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
స్ప్రింగ్ ఆనియన్స్: 2
తాజా కొత్తిమీర: 1cup
వెల్లుల్లి రెబ్బలు: 10
కార్న్ ఫ్లోర్ : 2tbsp
ఎండు మిర్చి: 1tbsp
చిల్లీ గార్లిక్ సాప్: 4tbsp
వరెస్టర్ షైర్ సాన్: 2tbsp
పచ్చిమిర్చి, 3-4(సన్నగా తరిగినవి)
బ్లాక్ పెప్పర్: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: 1cup
నూనె : 4tbsp

తయారుచేయు విధానం:
1. ముందుగా బోన్ లెస్ చికెన్ ను కావల్సిన సైజ్ లో కట్ చేసి, శుభ్రం చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
3. తర్వాత 10-12 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేడి చేయాలి.
5. వేగిన తర్వాత అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలను వేసి 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. ఇప్పుడు అన్ని వెజిటేబుల్ ముక్కలు(క్యాప్సికమ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు)ఒకదాని తర్వాత ఒకటి వేసి 5నుండి 10 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
7. ఇప్పుడు అందులో ఉప్పు, బ్లాక్ పెప్పర్ పొడి, వరెస్టర్ షైర్ సాస్ మరియు చిల్లీ గార్లిక్ సాస్ వేసి, మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ 5 నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
8. తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి, నీళ్ళు మరిగేటప్పుడు అందులో కార్న్ ఫ్లోర్ కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుతూ వేగించుకోవాలి.
9. మంటను కొద్దిగా ఎక్కువగా పెట్టి, చికెన్ మరియు వెజిటేబుల్స్ ను 5నిముషాలు ఉడికించుకోవాలి. అంతే వెజిటేబుల్ గార్లిక్ చికెన్ రిసిపి రెడీ.

English summary

Vegetable Garlic Chicken Recipe

Vegetable garlic chicken is another tasty chicken recipe that is richly flavored with garlic and exotic spices to give a wonderful tasty main dish to serve up at dinner. This recipe is full of nutrition’s and best for vegetable & chicken lover’s. Try out! and share your experience in comments below.
Story first published: Monday, January 5, 2015, 13:09 [IST]
Desktop Bottom Promotion